వైద్య విద్యలో తెలంగాణ రికార్డ్.. ఒకే ఏడాది 9 కాలేజీలకు అనుమతి

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కేవలం 9 ఏళ్లలో 5 నుంచి 26 ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఎదిగిందని అన్నారు మంత్రి హరీష్ రావు.

Advertisement
Update: 2023-06-07 15:54 GMT

వైద్య విద్యలో తెలంగాణ సరికొత్త రికార్డులు సృష్టించిందని అన్నారు మంత్రి హరీష్ రావు. తాజాగా కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుమతి లభించిందని ఆయన ప్రకటించారు. కరీంనగర్ కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. వైద్య విద్యలో తెలంగాణ కొత్తపుంతలు తొక్కుతోందని వివరించారు హరీష్ రావు.


ఒటకి కాదు, రెండు కాదు, ఏడాది కాలంలో మొత్తం 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనుమతి సాధించడం గొప్ప విషయం అని చెప్పారు మంత్రి హరీష్ రావు. ఇది జాతీయ రికార్డ్ అని అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగాం, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ కాలేజీలు ఒకే ఏడాదిలో అనుమతులు సాధించాయని, ఈ 9 కాలేజీల పరిధిలో 900 MBBS సీట్లు అదనంగా తెలంగాణకు లభించాయని అన్నారు.

సీఎం కేసీఆర్ సంకల్పం..

ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్ సంకల్పానికి ఇది నిదర్శనం అని అన్నారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కేవలం 9 ఏళ్లలో 5 నుంచి 26 ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఎదిగిందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వైద్యులకు, వైద్య విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఇది మైలురాయి అని అన్నారు హరీష్ రావు. 

Tags:    
Advertisement

Similar News