తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి - రాజ్యసభకు తెలిపిన కేంద్రం

బిజెపి పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్రలో, కర్నాటకలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఏపీలో కూడా స్వల్పంగా పెరిగాయి.

Advertisement
Update: 2023-02-03 15:50 GMT

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు 2017లో 846 ఉండగా, 2021 నాటికి 352కి తగ్గాయని కేంద్రం శుక్రవారం తెలిపింది.

బిజెపి పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్రలో, కర్నాటకలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఏపీలో కూడా స్వల్పంగా పెరిగాయి.

శుక్రవారం రాజ్యసభలో ఎంపీ నారాయణ్ దాస్ గుప్తా అడిగిన ప్రశ్నకు సమాధానంగా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ 2017 నుండి వివిధ రాష్ట్రాల్లో జరిగిన రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలను సమర్పించారు.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం, తెలంగాణలో 2017లో 846 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, 2021 నాటికి 352కి తగ్గింది.

రాష్ట్రంలో పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ ప్రకటనపై వ్యవసాయశాఖ మంత్రి ఎస్‌ నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ.. ఇప్పటికైనా రైతుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా బీజేపీ ఆపాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా, గత నాలుగేళ్లలో మహారాష్ట్ర, కర్ణాటకలలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు జరిగాయి. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు 2017లో 2,426 జరగగా, 2021 నాటికి 2,640కి పెరిగాయి.

కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలు 2017లో 1,157 జరగగా, 2021లో 1,170కి స్వల్పంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు 2017లో 375 జరగగా 2021లో 481కి పెరిగాయి.

Tags:    
Advertisement

Similar News