కేటీఆర్ కు అభినందనలు తెలుపుతూ ప్రభాస్ వీడియో

కేటీఆర్ ను అభినందిస్తూ ప్రముఖ నటుడు ప్రభాస్ ఇన్ స్టా లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఫార్ములా ఈ రేసు ను హైదరాబాద్ కు తీసుక రావడానికి కేటీఆర్ తీవ్రంగా కృషి చేశారని ప్రశంసించారు. కేటీఆర్ తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి, గ్రీన్ కో సీఈవో అనిల్ చలంశెట్టికి అభినందనలు తెలిపారు ప్రభాస్.

Advertisement
Update: 2023-01-29 02:58 GMT

ఫిబ్రవరి 11న హైదరాబాద్ లో జరగనున్న ఫార్ములా-ఈ రేసు కోసం సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. 11వ తేదీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నామని పలువురు ప్రముఖులు ఇప్పటికే సోషల్ మీడియాలో వ్యాఖ్యానించగా, టాలీవుడ్ ప్రముఖులు నాగార్జున, నాగచైతన్య తో సహా చాలామంది హీరోలు, ఇతర ప్రముఖులు తెలంగాణ మంత్రి కేటీఆర్ ను అభినందిస్తున్నారు.

తాజాగా కేటీఆర్ ను అభినందిస్తూ ప్రముఖ నటుడు ప్రభాస్ ఇన్ స్టా లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ రేసు ను హైదరాబాద్ కు తీసుక రావడానికి కేటీఆర్ తీవ్రంగా కృషి చేశారని ప్రశంసించారు. కేటీఆర్ తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి, గ్రీన్ కో సీఈవో అనిల్ చలంశెట్టికి అభినందనలు తెలిపారు ప్రభాస్.

ఫార్ములా-ఈ రేసు నిర్వహించడం ద్వారా పర్యావరణం పట్ల మన వైఖరిని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం వచ్చిందని ప్రభాస్ తన వీడియోలో అన్నారు. అలాగే హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని చెప్పిన ప్రభాస్ ఇది సుస్థిర భవిష్యత్తు కోసం భారత్ వేస్తున్న కీలక అడుగు అని అభిప్రాయపడ్డారు.

Tags:    
Advertisement

Similar News