ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి నోటీసులిచ్చిన పోలీసులు

గతేడేది అజ్మీర్‌ దర్గాపై రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో ఆయన‌పై చర్యలు తీసుకోవాలంటూ సయ్యద్‌ మహమూద్‌ అలీ అనే వ్యక్తి గత ఏడాది ఆగస్టు 24న కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలోనే ఆయనపై కేసు నమోదయ్యింది.

Advertisement
Update: 2023-01-20 06:55 GMT

ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి నోటీసులిచ్చిన పోలీసులు

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖలతో ఈ మధ్య  వివాదంలో చిక్కుకొన్న రాజాసింగ్ మరో సారి వివాదంలో ఇరుక్కున్నారు. అతనిపై అనేక కేసులు ఉండటంతో పీడీ యాక్ట్ పై జైలుకు వెళ్ళి అనంతరం బెయిల్ పై బైటికి వచ్చిన రాజాసింగ్ కు మంగళ్ హాట్ పోలీసులు మరో సారి 41ఎ కింద నోటీసులు ఇచ్చారు.

గతేడేది అజ్మీర్‌ దర్గాపై రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో ఆయన‌పై చర్యలు తీసుకోవాలంటూ సయ్యద్‌ మహమూద్‌ అలీ అనే వ్యక్తి గత ఏడాది ఆగస్టు 24న కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలోనే ఆయనపై కేసు నమోదయ్యింది. ఆ తర్వాత కంచన్ భాగ్ పోలీసులు ఆ కేసును మంగళ్ హాట్ పోలీసు స్టేషన్ కు బదిలీ చేశారు.

ఈ అంశంపై రాజాసింగ్ కు మంగళ్ హాట్ పోలీసులు ఈ రోజు నోటీసులు జారీ చేశారు. అయితే ఏడాది కిందట చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నోటీసులు జారీ చేయడం కక్ష సాధింపు చర్యే అని రాజా సింగ్ లాయర్ కరుణాసాగర్ ఆరోపించారు. ఈ కేసును కోర్టులో ఎదుర్కొంటామని ఆయన చెప్పారు.

కాగా, రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 

Tags:    
Advertisement

Similar News