మోడికుంట వాగు, గూడెం ఎల్‌ఐఎస్‌ డీపీఆర్‌కు GRMB ఆమోదం, త్వరలోనే CWC అనుమతి వచ్చే అవకాశం

అధికారిక వర్గాల ప్రకారం, GRMB అధికారులు రెండు ప్రాజెక్టుల DPRపై సంతృప్తి వ్యక్తం చేస్తూ శుక్రవారం CWCకి ఒక లేఖ రాశారు. CWC తుది ఆమోదం కోసం తమ‌ సమ్మతిని తెలియజేశారు.

Advertisement
Update: 2023-01-29 04:33 GMT

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మోడికుంట వాగు ప్రాజెక్టు, ఆదిలాబాద్‌ జిల్లాలోని గూడెం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఐఎస్‌) సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)కు గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) ఆమోదం తెలిపింది. ఫైనల్ అప్రూవల్ కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ కు పంపింది.

అధికారిక వర్గాల ప్రకారం, GRMB అధికారులు రెండు ప్రాజెక్టుల DPRపై సంతృప్తి వ్యక్తం చేస్తూ శుక్రవారం CWCకి ఒక లేఖ రాశారు. CWC  తుది ఆమోదం కోసం తమ‌ సమ్మతిని తెలియజేశారు.

ఇప్పటివరకు CWC , DPR క్లియర్ చేయని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌ల జాబితాలో మోడికుంట వాగు ప్రాజెక్ట్ ఉంది. అయితే GRMB యొక్క ఆమోదించని ప్రాజెక్ట్‌ల జాబితాలో గూడెం LIS ని పొరపాటుగా చేర్చారు.దాంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త DPRని పంపవలసి వచ్చింది.

తెలంగాణ‌ ఇరిగేషన్ అధికారుల ప్రకారం, రెండు ప్రాజెక్ట్ DPR లు ఇప్పుడు CWC సాంకేతిక సలహా కమిటీ (TAC) ముందు ఉంచుతారు. వివరణాత్మక అధ్యయనం తర్వాత వారు ఆమోదం తెలుపుతారు.

“మేము రెండు ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని సాంకేతిక వివరాలను సాంకేతిక సలహా కమిటీ(TAC ) ముందుంచుతాము. ఫిబ్రవరిలో జరగనున్న తదుపరి సమావేశంలో కమిటీ డీపీఆర్‌ను క్లియర్ చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము” అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

గూడెం ఎల్‌ఐఎస్, కడెం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్ కు పొడిగింపు కావడంతో తాజాగా డీపీఆర్‌ అవసరం లేదని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కడెంలో భాగమైన 3 టీఎంసీల నీరు లిఫ్ట్‌ అవుతుందని, అందుకే తాజా డీపీఆర్‌ అవసరం లేదని అధికారులు అంటున్నారు.

గోదావరి నదికి ఉపనది అయిన మోడికుంట వాగుపై 1,359 మీటర్ల మట్టి ఆనకట్టను నిర్మించి, 2.142 టిఎంసిల నీటిని నిల్వ చేసి 5,500 హెక్టార్ల కమాండ్ ఏరియాకు సాగునీరు అందించడంతో పాటు వాజీడులోని 35 గ్రామాలకు 0.12 టిఎంసి తాగునీటిని సరఫరా చేస్తారు.

Tags:    
Advertisement

Similar News