కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఆస్తులు 222 కోట్లట!

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్తుల విలువ మొత్తం 222.67 కోట్ల రూపాయలట. ఈ రోజు ఆయన బీజేపీ తరపున మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.

Advertisement
Update: 2022-10-10 16:44 GMT

మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఈ రోజు కోమటి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ఆస్తులను ప్రకటించారు. కోమ‌టిరెడ్డి ఆస్తుల విలువ రూ.222.67 కోట్లుగా ఆయన తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. అప్పులు రూ.61.5 కోట్లు. ఇక ఆయన భార్య ఆస్తులు 52.44 కోట్లు. కాగా కోమ‌టిరెడ్డి ఆస్తుల్లో స్థిరాస్తుల విలువ రూ.152.69 కోట్లు కాగా...చ‌రాస్తుల విలువ రూ.69.97 కోట్లుగా ఆయ‌న తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.

కాగా 2018 ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఇచ్చిన అఫిడవిట్ లో తన ఆస్తుల విలువ 24.5 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. అప్పుడు ఆయన భార్య అస్తుల విలువ 289.75 కోట్ల రూపాయలు.

Tags:    
Advertisement

Similar News