మెట్రో రైళ్లు సహా ఎక్కడికక్కడ స్తంభించిన తెలంగాణ... సామూహిక జాతీయ గీతాలాపన విజయవంతం

తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు జరిగిన జాతీయ గీతాలాపన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆబిడ్స్ వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
Update: 2022-08-16 07:22 GMT

ఈ రోజు 11.30 గంటలకు తెలంగాణ స్తంభించింది. రాష్ట్రం మొత్తం ఆ సమయానికి మెట్రో రైళ్ళు, బస్సులు, ఇతర వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఆ సమయానికి ఎక్కడ ఉన్న ప్రజలు అక్కడే ఆగిపోయి జాతీయ గీతాలాపన చేశారు.

ఆగస్టు 8న ప్రారంభమైన స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 16న ఉదయం 11:30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 4 కోట్ల మంది పౌరులు జాతీయ గీతం ఆలపించాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపునిచ్చింది.

ఆ పిలుపులో ఇవ్వాళ్ళ రాష్ట్రం మొత్తం భాగమయ్యింది. అబిడ్స్ జీపీఓ సర్కిల్ సమీపంలోని మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహం వద్ద జరిగిన‌ సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల వేలాదిమంది ఈ గీతాలాపనలో పాల్గొన్నారు. 

రాష్ట్రం 11.30 గంటల‌కు నిమిషం పాటు 'జనగణమన'తో మారుమోగింది. రాష్ట్రం లోని అన్ని ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యా లయాలు, పం చాయతీలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు అనేక ప్రైవేటు కార్యాలయాల వద్ద‌ సామూహికంగా జాతీయగీతాన్ని ఆలపించారు. 



Tags:    
Advertisement

Similar News