అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దన్నహైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీంకోర్టు

హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తే అవినాశ్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారంటూ అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా సునీత దాఖలు చేసిన పిటిషన్ వివరాలు కూడా తమకు తెలియదని, ఆ వివరాలు తెలియకుండా తాను వాదించలేను కాబట్టి సోమవారం వరకు ఈ కేసు విచారణను వాయిదా వేయాలని కోరారు.

Advertisement
Update: 2023-04-21 08:17 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఆయనను ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తే అవినాశ్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారంటూ అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా సునీత దాఖలు చేసిన పిటిషన్ వివరాలు కూడా తమకు తెలియదని, ఆ వివరాలు తెలియకుండా తాను వాదించలేను కాబట్టి సోమవారం వరకు ఈ కేసు విచారణను వాయిదా వేయాలని కోరారు. సోమవారం అవినాశ్ రెడ్డి వైపు వాదనలు వినిపిస్తామని న్యాయవాది తెలిపారు. అందుకు ఒప్పుకున్న సుప్రీం కోర్టు సోమవారం వరకు అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.

Tags:    
Advertisement

Similar News