కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే..

కేజ్రీవాల్‌కు మధ్యంతర‌ బెయిల్‌ ఇచ్చే అంశంపై సుప్రీంకోర్టు విచారించింది. ఈ అంశంపై మళ్లీ మే 9న విచారిస్తామని లేదంటే, వచ్చే వారం లిస్ట్‌ చేయాలని రిజిస్ట్రీకి సూచించింది.

Advertisement
Update: 2024-05-07 11:46 GMT

లోక్‌స‌భ ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఆయన కస్టడీని మే 20 వ‌ర‌కు రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. గతంలో విధించిన జ్యుడీషియల్‌ కస్టడీ నేటితో ముగియడంతో కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు ఆయన జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించింది.

మరోపక్క కేజ్రీవాల్‌కు మధ్యంతర‌ బెయిల్‌ ఇచ్చే అంశంపై సుప్రీంకోర్టు విచారించింది. ఈ అంశంపై మళ్లీ మే 9న విచారిస్తామని లేదంటే, వచ్చే వారం లిస్ట్‌ చేయాలని రిజిస్ట్రీకి సూచించింది. లిక్కర్‌ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News