భర్త ప్రైవేట్‌పార్ట్‌ కోసేందుకు భార్య యత్నం.. వీడియో వైరల్

యూపీకి చెందిన మెహర్ జాహన్‌, మహాన్‌ జైదీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ, మరో వ్యక్తితోనూ వివాహేతర బంధం నడిపిస్తోంది.

Advertisement
Update: 2024-05-07 10:05 GMT

మహిళలు గృహహింసకు గురవ్వడం నిత్యం చూస్తూనే ఉంటాం. ఇక్కడ మాత్రం కంప్లీట్ రివర్స్‌. ఓ భార్య తన భర్తను కట్టేసి చిత్రహింసలు పెట్టింది. సిగరెట్‌తో కాల్చింది. మర్మాంగాన్ని కత్తితో కోసేందుకు ప్రయత్నించింది. ఈ దారుణ ఘటన యూపీలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.


మ్యాటర్‌లోకి వెళ్తే.. యూపీకి చెందిన మెహర్ జాహన్‌, మహాన్‌ జైదీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ, మరో వ్యక్తితోనూ వివాహేతర బంధం నడిపిస్తోంది. భర్త నిలదీయడంతో అతనిపైనే దాడి చేయడం మొదలుపెట్టింది. తరచూ కొట్టడం, సిగరేట్లతో కాల్చడం చేస్తుండేది. భార్య వేధింపులు భరించలేక మహాన్ జైదీ పోలీసులను ఆశ్రయించాడు. కానీ వాళ్లు నమ్మలేదు. దీంతో బెడ్‌రూంలో రహస్యంగా సీసీ కెమెరాలు పెట్టాడు.

భర్తకు పాలల్లో మత్తు మందు కలిపి ఇచ్చి అతడి కాళ్లు, చేతుల్ని కట్టేసింది మెహర్ జాహన్. తర్వాత సిగరెట్ వెలిగించి చేతులు, కాళ్లు, ఒంటిపై వాతలు పెట్టింది. కత్తి తీసుకొచ్చి మర్మాంగాన్ని కట్‌ చేసేందుకు ప్రయత్నించింది. ఈసారి కూడా పోలీసులు నమ్మలేదు. దీంతో వాళ్లను తీసుకొచ్చి ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజీ చూపించాడు. షాక్ అయిన పోలీసులు మెహర్ జాహన్‌ని అరెస్ట్ చేశారు.

Tags:    
Advertisement

Similar News