కర్ణాటక ఎన్నికల్లో వరదలై పారుతున్న డబ్బు, మద్యం... పది రోజుల్లో 100 కోట్లు పట్టివేత‌

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన రోజు నుంచి ఈ పది రోజుల్లో రాజకీయ పార్టీలు అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యం, వస్తువులు 100కోట్ల మేర పట్టుబడ్డాయని ఎన్నికల అధికారులు ప్రకటించారు.

Advertisement
Update: 2023-04-10 02:59 GMT

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు, మద్యం, వరదలై పారుతోంది ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ నాయకులు డబ్బు, మద్యంతో పాటు విలువైన వస్తువులనుకూడా పెద్ద ఎత్తున పంచుతున్నారు.

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన రోజు నుంచి ఈ పది రోజుల్లో రాజకీయ పార్టీలు అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యం, వస్తువులు 100కోట్ల మేర పట్టుబడ్డాయని ఎన్నికల అధికారులు ప్రకటించారు.

మార్చి 29 నుంచి ఇప్పటివరకు రూ.99.18 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులు అధికారులు సీజ్‌ చేశారు. అందులో రూ.36.8 కోట్ల నగదు, రూ.15.16 కోట్ల వస్తువులు, 5.2 లక్షల లీటర్ల మద్యం (రూ.30 కోట్లు), రూ.15 కోట్ల విలువైన బంగారం, రూ.2.5 కోట్ల విలువైన వెండి నగలు సీజ్‌ చేశారు.

నిన్న‌ ఒక్కరోజే యాద్గిర్‌ జిల్లాలో రూ.34 లక్షల నగదు, బెంగళూరు రూరల్‌లో రూ.21 లక్షల విలువైన 56 టీవీలను పట్టుకున్నారు.ఇతర ప్రాంతాల్లో రూ.1.62 కోట్ల విలువైన 54 వేల లీటర్ల మద్యాన్ని కూడా అధికారులు సీజ్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News