మందుల ధరలు సవరించిన NPPA... పారాసిటమాల్ ట్యాబ్లెట్ ధర ఇకపై రూ. 2.76

ధరలు సవరించిన మందులలో అమోక్సిసిలిన్, క్లావులానిక్ యాసిడ్ యొక్క యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు ఉన్నాయి. వాంకోమైసిన్, ఆస్తమా మెడిసిన్ సాల్బుటమాల్, క్యాన్సర్ డ్రగ్ ట్రాస్టూజుమాబ్, బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్ డ్రగ్ టెమోజోలోమైడ్, పెయిన్ కిల్లర్ ఇబుప్రోఫెన్, నొప్పులు, జ్వరానికి ఉపయోగించే పారాసెటమాల్ ల ధరలను కూడా NPPA సవరించింది.

Advertisement
Update: 2023-01-17 05:13 GMT

ఔషధ ధరల నియంత్రణ సంస్థ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ మందులతో సహా 128 ఔషధాల ధరలను సవరించింది.

ధరలు సవరించిన మందులలో అమోక్సిసిలిన్, క్లావులానిక్ యాసిడ్ యొక్క యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు ఉన్నాయి. వాంకోమైసిన్, ఆస్తమా మెడిసిన్ సాల్బుటమాల్, క్యాన్సర్ డ్రగ్ ట్రాస్టూజుమాబ్, బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్ డ్రగ్ టెమోజోలోమైడ్, పెయిన్ కిల్లర్ ఇబుప్రోఫెన్, నొప్పులు, జ్వరానికి ఉపయోగించే పారాసెటమాల్ ల ధరలను కూడా NPPA సవరించింది.

నోటిఫికేషన్ ప్రకారం, ఒక అమోక్సిసిలిన్ క్యాప్సూల్ సీలింగ్ ధర రూ. 2.18గా నిర్ణయించారు. రూ.1.68కి సెటిరిజైన్ ఒక టాబ్లెట్, అమోక్సిసిలిన్ , క్లావులానిక్ యాసిడ్ ఇంజెక్షన్ రూ. 90.38, ఇబుప్రోఫెన్ 400 ఎంజి టాబ్లెట్ రూ. 1.07 గా నిర్ణయించారు.

నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) డ్రగ్స్ (ధరల నియంత్రణ) ఆర్డర్, 2013 (NLEM 2022) ప్రకారం 12 షెడ్యూల్డ్ ఫార్ములేషన్స్ రిటైల్ ధరను కూడా నిర్ణయించింది. యాంటీ-డయాబెటిస్ కాంబినేషన్ డ్రగ్ గ్లిమెపిరైడ్, వోగ్లిబోస్ & మెట్‌ఫార్మిన్ ఒక టాబ్లెట్ రిటైల్ ధర రూ.13.83గా నిర్ణయించారు.

అదే విధంగా, పారాసిటమాల్, ఫినైల్ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్, డిఫెన్‌హైడ్రామైన్ హైడ్రోక్లోరైడ్, కెఫిన్ ఒక టాబ్లెట్ రిటైల్ ధర రూ.2.76గా నిర్ణయించబడింది.

1997లో ఏర్పాటైన NPPAకి ఫార్మా ఉత్పత్తుల ధరల స్థిరీకరణ/సవరణ, DPCO నిబంధనల అమలు, నియంత్రణ లేని ఔషధాల ధరల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించబడ్డాయి.

Tags:    
Advertisement

Similar News