Ooru Peru Bhairavakona Box Office | మొదటి రోజు మెరిసిన భైరవకోన

Ooru Peru Bhairavakona Box Office Collection: సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమా ఊరు పేరు భైరవకోన. మొదటి రోజు ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి.

Advertisement
Update: 2024-02-17 12:49 GMT

సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమా ఊరు పేరు భైరవకోన. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే విడుదలకు 2 రోజుల ముందు నుంచే ప్రీమియర్స్ వేశారు. వాళ్ల నమ్మకమే నిజమైంది.

శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. అలా గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. పెయిడ్ ప్రీమియర్స్ నుంచి వసూళ్లతో కలుపుకొని, ఈ గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు.

ప్రస్తుతం థియేటర్లలో పోటీ లేదు. ఈగల్ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో ఊరు పేరు భైరవకోన సినిమాకు మరిన్ని వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు. ఈ వీకెండ్ గడిస్తే సినిమా పూర్తి స్వరూపం తెలుస్తుంది.

చాన్నాళ్లుగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సందీప్ కిషన్, ఊరు పేరు భైరవకోన సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందుకే మండుటెండలో కూడా విరామం లేకుండా ప్రమోషన్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నాడు. అటు నిర్మాత అనీల్ సుంకరకు కూడా ఈ సినిమా సక్సెస్ చాలా కీలకమనే విషయం తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News