విజయమ్మ ఆశీస్సులు తనయుడు వైఎస్‌ జగన్‌కే..

వైఎస్‌ జగన్‌ బుధవారంనాడు ఇడుపులపాయ నుంచి ‘మేమంతా సిద్ధం’ యాత్రను తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి నివాళులు అర్పించి ప్రారంభించారు. ఈ సమయంలో విజయమ్మ జగన్‌ వెంటే ఉన్నారు.

Advertisement
Update: 2024-03-28 06:52 GMT

దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ ఆశీస్సులు తన తనయుడు వైఎస్‌ జగన్‌కే ఉన్నాయి. తన కుమారుడిని రెండోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఆమె భగవంతుడిని ప్రార్థించారు. కూతురు షర్మిలా రెడ్డి ఏపీసీసీ అధ్యక్షురాలుగా నియమితులైన నేపథ్యంలో విజయమ్మ ఎవరివైపు ఉంటారనే సందేహం వ్యక్తమవుతూ వచ్చింది. ఎల్లో మీడియా సైతం వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా వార్తాకథనాలను ప్రచురించింది. కష్ట కాలంలో తన తల్లి విజయమ్మను వైఎస్‌ జగన్‌ నిర్లక్ష్యం చేశారని కూడా దుష్ప్ర‌చారం చేసింది. వాటికి కళ్లెం వేస్తూ వైఎస్‌ విజయమ్మ తన వైఖరిని స్పష్టం చేశారు.

రెండేళ్ల క్రితం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలి ప‌ద‌వి నుంచి వైఎస్‌ విజయమ్మ తప్పుకున్న సమయంలో వైఎస్‌ జగన్‌పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. వైఎస్‌ జగన్‌ కావాలని ఆమెను దూరం పెట్టారని ప్రత్యర్థులు విమర్శలు చేశారు. అదే సమయంలో కూతురు షర్మిల తెలంగాణలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని స్థాపించినప్పుడు ఆమె కూతురికి అండగా నిలిచారు. కొన్ని సభల్లో కూడా మాట్లాడుతూ తన కూతురిని ఆశీర్వదించాలని కోరారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహంలో ఆమె చురుగ్గా కనిపించారు.

వైఎస్‌ జగన్‌ బుధవారంనాడు ఇడుపులపాయ నుంచి ‘మేమంతా సిద్ధం’ యాత్రను తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి నివాళులు అర్పించి ప్రారంభించారు. ఈ సమయంలో విజయమ్మ జగన్‌ వెంటే ఉన్నారు. వైఎస్‌ జగన్‌ను ఆశీర్వదించారు. రెండో సారి తన కుమారుడు ముఖ్యమంత్రి అయ్యేలా ఆశీర్వదించాలని ఆమె భగవంతుడిని ప్రార్థించారు. ఆమె ప్రార్థనా పత్రాన్ని మీడియాకు విడుదల చేశారు.

‘‘జీసస్‌! నా కుమారుడిని నీకు అప్పగిస్తున్నాను. కష్టాల్లో నువ్వు నా బిడ్డ వెంట ఉన్నావు. ప్రతి కష్టసమయంలోనూ నువ్వు వెంట ఉన్నావు. నా బిడ్డ విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి కావాలని ఆశీర్వదించాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ ఆమె ప్రార్థనాపత్రంలోని విషయం.

Tags:    
Advertisement

Similar News