విజన్ విశాఖ.. జగన్ ఏం చెప్పారంటే..?

హైదరాబాద్‌లాంటి నగరం ఆంధ్రప్రదేశ్‌లో లేకపోవడం దురదృష్టమని అన్నారు సీఎం జగన్‌. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేస్తామని ఆయన మరోసారి నొక్కి చెప్పారు.

Advertisement
Update: 2024-05-08 17:22 GMT

విశాఖను కేవలం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించడమే కాదు, ఆ విషయంలో జగన్ విజన్ నిజంగా అద్భుతం. పదేళ్లలో విశాఖ నగరం హైదరాబాద్, బెంగళూరుతో సమానంగా అభివృద్ధి చెందేలా జగన్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనికోసం రూ. 1,05,000 కోట్ల పెట్టుబడితో విజన్‌ విశాఖను రూపొందిస్తున్నట్లు తెలిపారు. అగ్రగామి పారిశ్రామికవేత్తలంతా వైజాగ్‌ను తమ నెక్ట్స్ ఫిన్-టెక్ క్యాపిటల్‌గా చూస్తున్నారన్నారు సీఎం జగన్. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ తన వల్లే ఆగిపోయిందని చెప్పారు.

హైదరాబాద్‌లాంటి నగరం ఆంధ్రప్రదేశ్‌లో లేకపోవడం దురదృష్టమని అన్నారు సీఎం జగన్‌. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేస్తామని ఆయన మరోసారి నొక్కి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని క్లారిటీ ఇచ్చారు. విశాఖలో ఉన్నన్ని మౌలిక సదుపాయాలు ఏపీలో మరెక్కడా లేవన్నారు. గతంలో చూడని ఐకానిక్‌ కన్వెన్షన్‌ హాల్, స్టేడియం, సెక్రటేరియట్‌ విశాఖలో కట్టాలనేది తన ఆలోచన అని చెప్పారు సీఎం జగన్.

అమరావతిలో మౌలిక సదుపాయాలకే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారని కానీ ఫలితం లేదన్నారు సీఎం జగన్. అక్కడ ఖర్చు పెట్టినా ఇక ఫలితం లేదని, అందుకే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారాయన. ఇక ఏపీలో అభివృద్ధి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందన్నారు జగన్. ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నెంబర్‌-1 స్థానంలో ఉందన్నారు. ఉచిత వైద్యాన్ని మెరుగుపరచామని, మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టామని, పోర్ట్ లు, ఫిషింగ్ హార్బర్ లు నిర్మిస్తున్నామని చెప్పారు జగన్. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు ఉచితంగా ట్యాబ్ లు ఇస్తారని ఎవరైనా ఊహించారా అని ప్రశ్నించారు. ఇంటి వద్దకే పెన్షన్‌, ఇంటి వద్దకే రేషన్ ని కూడా ఎవరైనా ఊహించారా అని అడిగారు జగన్. ఇంత అభివృద్ధి, సంక్షేమం చేసిన ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News