పవన్‌ నువ్వో కల్తీ కాపు.. నీ చరిత్ర ఏంటో చెప్పు.. ముద్రగడ సంచలనం

పవన్‌కు ఇష్టమైతే రాబోయే ఎన్నికల్లో ఆయన ముగ్గురు భార్యలకు వైసీపీ తరపున టికెట్ ఇప్పిస్తానన్నారు. తాను నిఖార్సైన కాపునన్నారు ముద్రగడ. పవన్‌కు చరిత్ర ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement
Update: 2024-05-08 11:56 GMT

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మరోసారి ఫైర్ అయ్యారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. పవన్‌కల్యాణ్‌ తీరు వృద్ధనారి పతివ్రతలా ఉందన్నారు. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్‌ చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ముద్రగడ. మాటమాటకు కాపువాళ్లకు సాయం చేయరా అంటూ పవన్‌ మాట్లాడుతున్నారని, వంగా గీత కాపు కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ నుంచి వస్తే పట్టం కట్టాలా అంటూ పవన్‌ను నిలదీశారు. పవన్‌కల్యాణ్ నోరు కడుక్కుని మాట్లాడాలన్నారు ముద్రగడ.

తాను నిఖార్సైన కాపునన్నారు ముద్రగడ. పవన్‌కు చరిత్ర ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరు కాపో..ఎవరు కల్తీ కాపో ప్రజలకు తెలియాలన్నారు. గతంలో మెగా ఫ్యామిలీలో ఓ లవ్ ఎఫైర్ వచ్చినప్పుడు, ఆ హీరో నాయీ బ్రాహ్మణ కులానికి చెందిన వాడని చెప్పి.. అతనికి సినిమా అవకాశాలు రాకుండా చేసి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని సంచలన ఆరోపణలు చేశారు ముద్రగడ. పవన్‌కు ఇష్టమైతే రాబోయే ఎన్నికల్లో ఆయన ముగ్గురు భార్యలకు వైసీపీ తరపున టికెట్ ఇప్పిస్తానన్నారు.

కులం కోసం ఉద్యమం చేసి బలయ్యానన్నారు ముద్రగడ. చంద్రబాబు కాపు ఉద్యమాన్ని అణచివేసిన వ్యక్తి అని మండిప‌డ్డారు. ఈ విషయంపై గత 5 సంవత్సరాలు పవన్‌ ఎందుకు మాట్లాడలేదన్నారు ముద్రగడ. తనను జైలులో పెట్టించేందుకు చంద్రబాబు చేయని కుట్రలేదన్నారు. కొందరు దుష్టుల వల్ల తన కూతురు తనకు దూరమైందని భావోద్వేగానికి గురయ్యారు.

Tags:    
Advertisement

Similar News