మహిళా మంత్రిని ఓడించేందుకు టీడీపీ ఇంత దిగజారిపోవాలా..?

ఇలాంటి చీప్ ట్రిక్స్ తో టీడీపీ గెలవాలుకుంటుందా..? అని రాష్ట్రం మొత్తం ఆ పార్టీని చీదరించుకుంటోంది.

Advertisement
Update: 2024-04-27 02:30 GMT

మహిళా మంత్రి విడదల రజినికి సిట్టింగ్ స్థానం చిలకలూరిపేట కాకుండా ఈసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కేటాయించారు సీఎం జగన్. అక్కడ టీడీపీ తరపున పిడుగురాళ్ల మాధవి బరిలో ఉన్నారు. అయితే విడదల రజినిపై కూటమి కుట్ర చేసింది. ఆమెను ఓడించేందుకు.. అదే పేరుతో ఉన్న మరో మహిళతో నామినేషన్ వేయించాలని చూసింది. ఆ పాచిక పారకపోవడంతో ఇప్పుడు కోర్టులో కేసు వేసి మరో నాటకానికి తెరతీసింది.

అసలేం జరిగింది..?

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఏసుభక్త నగర్ లో విడదల రజిని అనే పేరున్న మహిళ ఉన్నారు. ఆమెకు రాజకీయాలతో సంబంధం లేదు, కనీసం ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన కూడా ఆమెకు లేదు. కానీ టీడీపీ నేతలు వైసీపీ అభ్యర్థి విడదల రజినికి ఇబ్బంది కలిగించేలా స్థానిక మహిళతో నామినేషన్ వేయించాలనుకున్నారు. ఆమెకు ఇష్టం లేకపోయినా బలవంతంగా నామినేషన్ వేయించాలనుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆమె తండ్రి సీన్ లోకి వచ్చారు. తన కుమార్తెను టీడీపీ నేతలు అపహరించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు, టీడీపీ నేతల వద్ద బందీగా ఉన్న విడదల రజినిని తనతో తీసుకెళ్లారు.

ఇక్కడ సీన్ మరో మలుపు తిరిగింది. టీడీపీ నేతలు మరింత రచ్చ చేస్తున్నారు. పోలీసులను అడ్డు పెట్టుకుని ఆమె నామినేషన్ ని వైసీపీ నేతలు అడ్డుకున్నారంటూ హడావిడి మొదలు పెట్టారు. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమెను అభ్యర్థిగా బలపరుస్తూ సంతకం చేసిన వ్యక్తిని తానేనంటూ తెరపైకి వచ్చిన పఠాన్‌ అస్మతుల్లా కోర్టులో ఈ పిటిషన్ వేశారు. రజినిని, ఆమె భర్తను పోలీసులు నిర్బంధించారంటూ తన పిటిషన్ లో పేర్కొన్నారు. వారిని వెంటనే కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలని కోరారు.

ఈ ఎపిసోడ్ మొత్తంలో టీడీపీ తన పరువు తానే తీసుకుంది. న్యాయబద్ధంగా పోటీ చేయలేక, ఇలా వైసీపీ అభ్యర్థి, మంత్రి విడదల రజిని పేరున్న మహిళను తీసుకొచ్చి నామినేషన్ వేయించాలనుకుంది టీడీపీ. ఆ ప్లాన్ ఫెయిలవడంతోపాటు, జనంలో పరువు కూడా పోయింది. ఇలాంటి చీప్ ట్రిక్స్ తో టీడీపీ గెలవాలుకుంటుందా..? అని రాష్ట్రం మొత్తం ఆ పార్టీని చీదరించుకుంటోంది. 

Tags:    
Advertisement

Similar News