ఇంత త్వరగా విచారణను అమరావతివాదులు ఊహించలేదా..?

ప్రతికూల అంశాన్ని లేవనెత్తిన తర్వాత విచారణ జరపడం సరికాదని భావించిన సీజేఐ విచారణను నుంచి తప్పుకున్నారు. తాను లేని మరో ధర్మాసనం కేసును విచారిస్తున్నందని చెప్పారు.

Advertisement
Update: 2022-11-04 04:30 GMT

ఏపీ రాజధాని కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మూడు రోజుల క్రితం ఈ కేసు ప్రధాన న్యాయూమర్తి యూయూ లలిత్ ధర్మాసనం ముందుకు రాగా అమరావతివాదులు కొత్త అంశాన్ని లేవనెత్తారు. గతంలో న్యాయవాదిగా విభజన చట్టంపై అభిప్రాయం ఇచ్చిన విషయాన్ని సీజేఐకి గుర్తు చేశారు. అలా గుర్తు చేస్తూనే మీరే విచారించిన అభ్యంతరం లేదని కోరారు. ప్రతికూల అంశాన్ని లేవనెత్తిన తర్వాత విచారణ జరపడం సరికాదని భావించిన సీజేఐ విచారణను నుంచి తప్పుకున్నారు. తాను లేని మరో ధర్మాసనం కేసును విచారిస్తున్నందని చెప్పారు.

ఆ పరిణామాన్ని అమరావతివాదులు, టీడీపీ తన విజయంగా పరోక్షంగా ప్రచారం చేసుకున్నాయి. గతంలో యూయూ లలిత్ జగన్ కేసుల్లో లాయర్ గా వాదించిన అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఆయన లేని ధర్మాసనం ముందుకు కేసు వెళ్లడం మంచి పరిణామామే అన్నట్టుగా మాట్లాడారు. కొందరు మరో అడుగు ముందుకేసి ఇక ఈ కేసు ఇప్పట్లో విచారణకు రాదు.. జగన్‌ అనుకున్నట్టు మూడు రాజధానులు ఇప్పట్లో సాధ్యం కాదని మాట్లాడారు. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పే అమలులో ఉంటుందని అభిప్రాయపడ్డారు.

అయితే ఊహించని విధంగా గురువారం ఈ కేసుపై కీలక నిర్ణయం వెలువడింది. శుక్రవారం అంటే నేడే ఈ కేసును విచారించబోతున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. జస్టిస్ జోసెఫ్, రుషికేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఈ పరిణామం ఒక విధంగా షాకింగ్‌గానే ఉందని టీడీపీ అనుకూల టీవీ చానళ్లు అభిప్రాయపడడం విశేషం. నేడు సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు, పరిణామాలుంటాయో చూడాలి.

Advertisement

Similar News