బ్యాంకుల ముందు వృద్ధుల పడిగాపులు.. ఈ పాపం చంద్రబాబుదే

పెన్షన్ పంపిణీకి వాలంటీర్లు వద్దంటూ ఈసీకి ఫిర్యాదు చేయించి మరీ ఆపించారు చంద్రబాబు. దానివల్లే వృద్ధులు ఇప్పుడు అవస్థలు పడుతున్నారు.

Advertisement
Update: 2024-05-02 07:35 GMT

ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీ మళ్లీ రచ్చగా మారింది. చంద్రబాబు కారణంగా వాలంటీర్ వ్యవస్థను పెన్షన్ల పంపిణీకి దూరం పెట్టింది ఈసీ. దీంతో ఈ వ్యవహారంలో తేడా వచ్చేసింది. వృద్ధులు, వికలాంగులు గత నెల సచివాలయాలకు వచ్చి పెన్షన్లు తీసుకున్నారు. కొంతమంది వృద్ధులు ఎండ దెబ్బకు విలవిల్లాడారు. మరికొందరు సచివాలయాల వరకు రాలేక అవస్థలు పడ్డారు. చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతున్న నేపథ్యంలో మరోసారి ఆయన డ్రామా మొదలు పెట్టారు. సచివాలయాల వద్ద పెన్షన్లు వద్దని, ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి నేతలతో ఈసీకి ఫిర్యాదు చేయించారు. దీంతో అధికారులు పెన్షన్ల విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈనెల డీబీటీ ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారు. వికలాంగులకు మాత్రం ఇంటికి వెళ్లి ఇస్తున్నారు.

బ్యాంకుల వద్ద పడిగాపులు..

ప్రతి నెలా వాలంటీర్ ఇంటికి వచ్చి పెన్షన్ డబ్బులు చేతిలో పెడితే వృద్ధులు, వికలాంగులు తమ అవసరాలకు వాటిని వినియోగించుకునేవారు. ప్రతి నెలా ఠంచనుగా ఒకటో తేదీ వారికి పెన్షన్ అందుతుండటంతో వారి అవసరాలు కూడా తీరేవి. కానీ ఇప్పుడు డబ్బులు బ్యాంకుల్లో పడటంతో లబ్ధిదారులు బ్యాంకుల వద్దకు క్యూ కట్టారు. అక్కడ కూడా వారికి అవస్థలు తప్పలేదు. పెద్ద పెద్ద క్యూలైన్లలో వారు పడిగాపులు పడుతున్నారు. కొన్ని చోట్ల బ్యాంకులు తెరుచుకోకముందే.. పెద్ద సంఖ్యలో అక్కడికి పెన్షన్‌ డబ్బుల కోసం వృద్దులు తరలివెళ్తున్నారు.

బాబుదే పాపం..

పెన్షన్ పంపిణీకి వాలంటీర్లు వద్దంటూ ఈసీకి ఫిర్యాదు చేయించి మరీ ఆపించారు చంద్రబాబు. దానివల్లే వృద్ధులు ఇప్పుడు అవస్థలు పడుతున్నారు. ఒకటో తేదీ పెన్షన్ అందుకోలేకపోగా.. ఓసారి సచివాలయానికి, మరోసారి బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి. వచ్చేనెల కూడా ఇవే అవస్థలు ఉంటాయి. వీటన్నిటికీ కారణం అయిన చంద్రబాబు ఇప్పుడు పెన్షన్ దారులకు విలన్ లా కనపడుతున్నారు. ఈ కోపం అంతా ఎన్నికల రోజు వారు తీర్చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు టీడీపీ కూటమి భయపడుతోంది, ఎల్లో మీడియా ద్వారా ఆ తప్పు ప్రభుత్వంపై నెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. 

Tags:    
Advertisement

Similar News