పులివర్తి నానిపై దాడి కేసులో 13మంది అరెస్ట్

ఏపీలో ఈసారి ఎన్నికల్లో పోల్ పర్సంటేజ్ పెరిగినట్టే ఘర్షణలు కూడా పెరిగాయి. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో దాడులు పెచ్చుమీరాయి.

Advertisement
Update:2024-05-16 15:43 IST

ఎన్నికల అనంతరం ఏపీలో జరిగిన దాడుల వ్యవహారంలో పోలీసులు స్పీడ్ పెంచారు. అయితే ఇక్కడ కూడా వారు విమర్శలను ఎదుర్కోవడం విశేషం. పల్నాడులో టీడీపీ నేతలు రెచ్చిపోయారని, తమవారిపై దాడి చేశారని, బాంబులు వేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తే.. ఆ కేసులో మాత్రం పురోగతి లేదు. అదే సమయంలో చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతపై జరిగిన దాడి కేసులో వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేయడం విశేషం.

చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి కేసులో భానుకుమార్‌రెడ్డి, గణపతి రెడ్డిని పోలీసులు ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు. వారితోపాటు మరో 11 మందిని అరెస్ట్‌ చేశారు. మొత్తం 13 మందికి తిరుపతి ఏడీజే కోర్టు 14 రోజులపాటు రిమాండ్‌ విధించింది. వారందర్నీ చిత్తూరు సబ్‌జైలుకు తరలించారు.

ఏపీలో ఈసారి ఎన్నికల్లో పోల్ పర్సంటేజ్ పెరిగినట్టే ఘర్షణలు కూడా పెరిగాయి. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో దాడులు పెచ్చుమీరాయి. ఎన్నికల రోజుకంటే, ఆ తర్వాతే దాడులు జరగడం విశేషం. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్‌ రూమ్‌ పరిశీలనకు వెళ్లిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. 

Tags:    
Advertisement

Similar News