హత్యాయత్నం కేసులో ఎస్‌ఐ అరెస్ట్‌, జడ్జి అరెస్ట్‌కు రంగం సిద్ధం

మహారాణిపేట అఫీషియల్ కాలనీకి చెందిన రాజేష్‌ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిలో భీమిలి కోర్టులో మెజిస్ట్రేట్ విజయలక్ష్మీకి విభేదాలు వచ్చాయి. దాంతో అతడిని చంపేయాలని న్యాయమూర్తి నిర్ణయించుకున్నారు.

Advertisement
Update: 2022-10-09 02:43 GMT

రియల్టర్‌ హత్యాయత్నం కేసులో విశాఖకు చెందిన మహిళా ఎస్‌ఐ నాగమణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో భీమిలి కోర్టు మెజిస్ట్రేట్‌ విజయలక్ష్మీ ప్రమేయంపైనా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే జడ్జి విజయలక్ష్మీ కారు డ్రైవర్ అప్పలరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మహారాణిపేట అఫీషియల్ కాలనీకి చెందిన రాజేష్‌ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిలో భీమిలి కోర్టులో మెజిస్ట్రేట్ విజయలక్ష్మీకి విభేదాలు వచ్చాయి. దాంతో అతడిని చంపేయాలని న్యాయమూర్తి నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తన సోదరి అయిన ఎస్‌ఐ నాగమణి, డ్రైవర్ అప్పలరెడ్డి సాయం తీసుకుంది. వీరికి మరో కానిస్టేబుల్ కూడా సహకరించారు. అందరూ కలిసి రాజేష్‌ హత్యకు 30వేల సుపారీ ఇచ్చారు.

కిరాయి వ్యక్తులు ఈ ఏడాది జూన్‌ 18న రాజేష్ బైక్‌లో వెళ్తున్న సమయంలో ఇసుప రాడ్లతో దాడి చేశారు. అతడు తృటిలో తప్పించుకుని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కాల్ డేటా ఆధారంగా కూపీ లాగగా.. న్యాయమూర్తి, ఎస్‌ఐ పాత్ర బయటకు వచ్చింది. కిరాయివ్యక్తులు క్రాంతికుమార్‌, రఘునాథ్‌, మహేష్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా వారు సుపారీ ఇచ్చిన వ్యక్తుల పేర్లను చెప్పారు.

తమ పేర్లు బయటకు వచ్చిన తర్వాత ఎస్‌ఐ నాగమణి పరారీలో ఉన్నారు. విజయవాడ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇలా పలుప్రాంతాల్లో ఆమె తలదాచుకున్నారు. ఎట్టకేలకు ఒడిశాలో నాగమణి పట్టుబడింది. ఈ కేసులో జడ్జి విజయలక్ష్మీ అరెస్ట్‌ కోసం నిబంధనల ప్రకారం పోలీసులు ముందుకెళ్తున్నారు.

Tags:    
Advertisement

Similar News