ఈసీ నిర్ణయాలను సవాల్ చేస్తూ హైకోర్టుకు..

వైఎస్‌ఆర్ ఆసరా, విద్యా దీవెన పథకాలను అడ్డుకుంది. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇవ్వకూడదని ఆదేశించింది.

Advertisement
Update: 2024-05-07 07:05 GMT

ఏపీలో ఎన్నికల సంఘం ఆదేశాలను సవాల్ చేస్తూ లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థులు, రైతులు, మహిళలు కోర్టులో పిటిషన్ వేశారు. లంచ్‌మోషన్ కింద హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారించనుంది. తెలంగాణలో సంక్షేమ పథకాల నగదు బదిలీకి అంగీకారం తెలిపిన ఈసీ ఏపీలో మాత్రం బ్రేకులు వేసింది.

వైఎస్‌ఆర్ ఆసరా, విద్యా దీవెన పథకాలను అడ్డుకుంది. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇవ్వకూడదని ఆదేశించింది. చివరకు పంట నష్టం అంచనా కార్యక్రమానికి కూడా నో చెప్పింది. తెలంగాణలో మాత్రం రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, రైతు బంధు పథకాల అమలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ ద్వంద్వ వైఖరిని సవాల్ చేస్తూనే లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించారు. 2019లో ఇదే ఏపీలో ఎన్నికలకు మూడు రోజుల ముందు పసుపు-కుంకుమ నిధుల విడుదలకు ఈసీ అనుమతి ఇచ్చిన విషయాన్ని లబ్దిదారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Tags:    
Advertisement

Similar News