కోర్టు ఆదేశాల‌ ధిక్క‌ర‌ణ‌.. ష‌ర్మిల‌పై బ‌ద్వేల్‌లో కేసు న‌మోదు

క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థిగా కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తున్న ష‌ర్మిల ప‌దేప‌దే వివేకా హ‌త్య కేసు గురించి ప్ర‌స్తావిస్తున్నారు. వివేకా హ‌త్య కేసులో నిందితుడైన వైఎస్ అవినాష్‌రెడ్డికి జ‌గ‌న్ టికెటిచ్చారని, చిన్నాన్న‌ను చంపిన వ్య‌క్తిపై ఇదేం ప్రేమంటూ విమ‌ర్శిస్తున్నారు.

Advertisement
Update: 2024-05-07 07:39 GMT

ఏపీసీసీ అధ్య‌క్షురాలు ష‌ర్మిలపై బ‌ద్వేల్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు గురించి మాట్లాడొద్దంటూ క‌డ‌ప కోర్టు ఆదేశించినా.. పెడ‌చెవిన పెట్టి ప్ర‌చారంలో వివేకా కేసుపై మాట్లాడినందుకు బ‌ద్వేల్ పోలీసులు ఆమెపై కేసు న‌మోదు చేశారు.

క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థిగా కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తున్న ష‌ర్మిల ప‌దేప‌దే వివేకా హ‌త్య కేసు గురించి ప్ర‌స్తావిస్తున్నారు. వివేకా హ‌త్య కేసులో నిందితుడైన వైఎస్ అవినాష్‌రెడ్డికి జ‌గ‌న్ టికెటిచ్చారని, చిన్నాన్న‌ను చంపిన వ్య‌క్తిపై ఇదేం ప్రేమంటూ విమ‌ర్శిస్తున్నారు. దీనిపై అవినాష్‌రెడ్డి వ‌ర్గీయులు క‌డ‌ప కోర్టులో పిటిష‌న్ వేశారు. విచారించిన కోర్టు ఎన్నిక‌ల వేళ ఏ రాజ‌కీయ పార్టీగానీ, అభ్య‌ర్థులు గానీ వివేకా హత్య కేసు గురించి మాట్లాడొద్దంటూ గ‌త నెల‌లో ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాల‌ను తుంగ‌లో తొక్కుతూ ష‌ర్మిల వివేకా మ‌ర‌ణ‌మే ప్ర‌ధానాస్త్రంగా ప్ర‌చారం చేస్తున్నారు. బ‌ద్వేల్‌ పోలీసులు తాజాగా దీనిపై కేసు న‌మోదు చేసిన నేప‌థ్యంలో కోర్టు ష‌ర్మిల‌పై చ‌ర్య‌లు తీసుకుంటుందా అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అవినాష్‌రెడ్డికి టికెటివ్వ‌క‌పోతే క‌డ‌ప‌లో పోటీకి దిగేవారు కాద‌ట‌!

టీడీపీ అండ‌తోనే ష‌ర్మిల జ‌గన్‌పైకి ఈ స్థాయిలో దూసుకొస్తున్నారు. ఎలాగైనా జ‌గ‌న్‌ను బ‌ద్నాం చేయాల‌నే టీడీపీ ష‌ర్మిల‌ను రెచ్చ‌గొడుతుంద‌ని ఓట‌ర్ల‌కు కూడా తెలుసు. కానీ, ష‌ర్మిల మాత్రం బాబాయ్‌ హత్య కేసులో న్యాయం జ‌ర‌గాల‌నే క‌డ‌ప‌లో పోటీ చేస్తున్నానని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. జ‌గ‌న్ అవినాష్‌కు టికెటివ్వ‌క‌పోతే క‌డ‌ప‌లో అస‌లు పోటీ చేసేదాన్నే కాద‌ని అన‌డం మ‌రింత హాస్యాస్ప‌దం. ఎందుకంటే ష‌ర్మిల‌కు ప‌డే ఆ నాలుగు ఓట్లూ కూడా క‌డ‌ప‌లో అయితేనే ప‌డ‌తాయి. ఎందుకంటే ఆమె దివంగ‌త సీఎం రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తె అన్న ప్రాంతీయాభిమానంతో మాత్ర‌మే. దాన్ని క‌ప్పిపుచ్చుతూ వివేకా కేసులో న్యాయం కోసం నిలబ‌డ్డాన‌ని సినిమా డైలాగులు చెబుతుండ‌ట‌మే విడ్డూరం.

Tags:    
Advertisement

Similar News