మళ్లీ తెరపైకి పవన్ కల్యాణ్ ఫ్యామిలీ మేటర్..

పవన్ కల్యాణ్ కడప జిల్లా టూర్ లో వైఎస్ఆర్ ఫ్యామిలీ విషయాలను ప్రస్తావించడంతో మరోసారి వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ ఫ్యామిలీ మేటర్ లో వేలు పెట్టారు.

Advertisement
Update: 2022-08-20 17:02 GMT

పవన్ కల్యాణ్

గతంలో పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి, భార్యల గురించి వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేసేవారు. ఓ దశలో సీఎం జగన్ కూడా పవన్ పై సెటైర్లు వేశారు. ఆ తర్వాత ఆ విషయాలు పూర్తిగా తగ్గిపోయాయి. కానీ పవన్ కల్యాణ్ కడప జిల్లా టూర్ లో వైఎస్ఆర్ ఫ్యామిలీ విషయాలను ప్రస్తావించడంతో మరోసారి వైసీపీ నేతలు పవన్ ఫ్యామిలీ మేటర్ లో వేలు పెట్టారు. డిప్యూటీ సీఎం అంజాద్ భాషా పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన అన్న జగన్ తనకు అన్యాయం చేశారని షర్మిల, పవన్ కల్యాణ్ కి చెప్పారా అని ప్రశ్నించారు అంజాద్ భాషా. భార్యని మోసం చేసింది పవన్ కల్యాణేనని, ఆయన మాజీ భార్య పవన్ పై బహిరంగంగానే విమర్శలు చేశారని చెప్పారు.

హిడెన్ అజెండా..

పవన్ కల్యాణ్ ఒక హిడెన్ అజెండాతో కడప జిల్లాకు వచ్చారని మండిపడ్డారు అంజాద్ భాషా. చంద్రబాబు దత్త పుత్రుడు రైతులకు మేలు చేయడానికి రాలేదని, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చారని అన్నారు. రాష్ట్రంలో కుల మతాల ప్రస్తావన లేకుండా వైసీపీ పాలన సాగిస్తోందని చెప్పారు. కరుడు గట్టిన టీడీపీ కార్య కర్తలకు కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, మంచి చేస్తున్నామని చెప్పారు. పవన్, చంద్రబాబు కలిసి వైసీపీకి కులం, మతం అంటగడుతున్నారని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే కడప జిల్లా ప్రజలు తరిమి తరిమికొడతారు ఖబడ్దార్ అని హెచ్చరించారు. కౌలు రైతులకు కార్డు ఉండి, ప్రభుత్వ సాయం అందక పోయినట్లు నిరూపిస్తే నువ్వు ఏం చెబితే అది చేస్తాను పవన్ అంటూ అంజాద్ భాషా సవాల్ విసిరారు. చంద్రబాబు హయాంలో రైతులు అత్మ హత్యలు చేసుకుంటే ఎందుకు స్పందించలేదని అడిగారు. ప్యాకేజీ నాయకుడు పవన్ కల్యాణ్ అని ఘాటుగా విమర్శించారు.

టీడీపీ హయాంలో మద్యం కనపడలేదా..?

పద్యం పుట్టిన గడ్డలో మద్యం ఏరులై పారుతోందని పవన్ చేసిన విమర్శలను కూడా తిప్పికొట్టారు అంజాద్ భాషా. గత టీడీపీ ప్రభుత్వంలో 45 వేల బెల్టు షాపులు పెట్టి, మద్యాన్ని ఏరులై పారించారని, అప్పుడు మాట్లాడకుండా ఉన్న ఇప్పుడెందుకు రెచ్చిపోతున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం బెల్టు షాపులు రద్దు చేసిందని, ఇది తెలియక పవన్ అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News