పవన్ డ్రామా బయటపడిందా?

బహిరంగసభకు స్ధలమిచ్చింది ఎవరో అయితే ఇప్పుడు చెక్కులు అందుకున్నది ఇంకెవరో అన్న విషయం బయపడింది. తమ బహిరంగసభకు స్ధలమిచ్చారు కాబట్టే కక్షతో ఇళ్ళను కూల్చేశారని పవన్ ఆరోపణల్లో డొల్లతనం బయటపడింది.

Advertisement
Update: 2022-11-28 05:57 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ డ్రామా అంతా బయటపడిందా? ఇప్పటం గ్రామంలో ఇళ్ళు కోల్పోయిన బాధితులనే పేరుతో పవన్ కొంత మందికి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 39 మందికి పవన్ తలా లక్ష రూపాయల చెక్కులను అందించారు. ఇళ్ళు కోల్పోయిన వాళ్ళనే ప్రచారం జరిగిన వాళ్ళకి తాజాగా చెక్కులు అందుకున్న వాళ్ళకి అసలు సంబంధమే లేదట. ఈ విషయాన్ని సాక్షి మీడియా బయటపెట్టింది. ప్రభుత్వం గుర్తించిన ఆక్రమణలు 53 అయితే కొట్టేసింది 52 ప్రహరీ గోడలను. ఒకరు హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్న కారణంగా ఆ కాంపౌండ్ వాల్ కొట్టలేదు.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమైతే జనసేన ఆవిర్భావ సభ 6.7 ఎకరాల్లో జరిగింది. సాంబిరెడ్డి, తిరుమలశెట్టి సామ్రాజ్యం, ఆదినారాయణ, గాజుల సాంబయ్య, శంకరశెట్టి శ్రీనివాసరావు, శంకరశెట్టి పిచ్చయ్య, శంకరశెట్టి రాయుడు, ఉమామహేశ్వరరావు, గాజుల నరసయ్య బహిరంగసభకు తమ భూమిఇచ్చారు. రోడ్డును ఆక్రమించుకుని కాంపౌడ్ వాల్స్ కట్టుకున్న వాళ్ళ జాబితాలో పై ఎనిమిది మంది లేనేలేరు.

ఇప్పుడు బాధితుల పేర్లతో పవన్ 39 మందికి చెక్కులను అందించారు. అయితే వీరిలో ఏ ఒక్కరి ఇంటిని కూడా ప్రభుత్వం ముట్టుకోలేదు. కేవలం ప్రహరీ గోడలను మాత్రమే కూల్చింది. తాము రోడ్డును ఆక్రమించుకుని ప్రహరీ గోడలు కట్టుకున్నట్లు వీళ్ళే అంగీకరించారు. బహిరంగసభకు స్ధలమిచ్చింది ఎవరో అయితే ఇప్పుడు చెక్కులు అందుకున్నది ఇంకెవరో అన్న విషయం బయపడింది. తమ బహిరంగసభకు స్ధలమిచ్చారు కాబట్టే కక్షతో ఇళ్ళను కూల్చేశారని పవన్ ఆరోపణల్లో డొల్లతనం బయటపడింది.

ఇక్కడ మూడు పాయింట్లు చాలా కీలకం. అవేమిటంటే బహిరంగ సభకు స్ధలమిచ్చిన వాళ్ళ ఇళ్ళ జోలికి ప్రభుత్వం వెళ్ళనేలేదు. రెండో పాయింట్ ఏమిటంటే ఇప్పుడు చెక్కులు అందుకున్న వాళ్ళలో ఎవరు కూడా బహిరంగ సభకు భూమి ఇవ్వలేదు. మూడో పాయింట్ ఏమిటంటే పవన్ ఆరోపిస్తున్నట్లు ఒక్క ఇంటిని కూడా కూల్చలేదు. ప్రభుత్వ కక్ష సాధింపులకు ఇళ్ళు నష్టపోయిన వాళ్ళకి చెక్కుల పంపిణీ చేశామని పవన్ చెప్పటమే బోగస్ అని తేలిపోయింది. ఎందుకంటే అసలిక్కడ బాధితులే లేరు. ఈ విషయం హైకోర్టు విచారణలోనే బయటపడింది.

Tags:    
Advertisement

Similar News