మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ - మంత్రి బొత్స సత్యనారాయణ

ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు సఫలమైన అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులకి సంబంధించిన రెండు అంశాలపై చర్చించామన్నారు. ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌పై వస్తున్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తామన్నారు.

Advertisement
Update: 2022-09-01 15:14 GMT

తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు సఫలమైన అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులకి సంబంధించిన రెండు అంశాలపై చర్చించామన్నారు. ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌పై వస్తున్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తామన్నారు. ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వం దృష్టికి ఏ సమస్య తీసుకొచ్చినా తప్పకుండా పరిష్కరిస్తామన్నారు. టీచర్లపై పెట్టిన కేసుల ఎత్తివేత అంశాన్ని సీఎం వైఎస్ జ‌గ‌న్‌ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఇవాళ 86 శాతం మంది ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌లో హాజరు నమోదు చేసుకున్నారని వెల్లడించారు. సర్వీస్ రూల్స్ లో ఉన్నవాటినే ప్ర‌భుత్వం అమలు చేస్తుంద‌ని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు వీలైనంత మేరకు మంచి చేయాలని తపనపడుతున్న‌ట్లు చెప్పారు. సీపీఎస్ అంశంపై మూడ్రోజుల్లో ఉద్యోగులతో మాట్లాడతామని ప్రకటించారు. రాష్ట్రంలో 670 ఎంఈవో పోస్టులు భర్తీ చేయాలని సీఎం చెప్పారని, 248 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎంఈవోలుగా నియమిస్తామని వెల్లడించారు. కొత్తగా 38 డిప్యూటీ డీఈవో పోస్టులను భర్తీ చేస్తున్న‌ట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News