జనసేన రంగు పులుముకున్న విశాఖ కాపు సభ

రాజకీయాలకు అతీతం అని తొలుత చెప్పినప్పటికీ ఆఖరిలో జనసమీరణ జనసేన నుంచి ఎక్కువగా జరుగుతోందన్న అనుమానం ఉంది. పోస్టర్ ఆవిష్కరించిన గంటా శ్రీనివాస్ హాజరవుతారా లేదా అన్న దానిపై అందరి దృష్టి ఉంది.

Advertisement
Update: 2022-12-26 10:42 GMT

విశాఖలో నేడు సాయంత్రం జరగనున్న కాపుల బహిరంగ సభకు రాజకీయ రంగు పులుముకుంది. ఈ సభపై జనసేన ముద్ర పడింది. దాంతో ఈ మీటింగ్‌కు దూరంగా ఉండాలని తమ పార్టీల నేతలకు వైసీపీ, టీడీపీ ఆదేశించాయి. ఈ సభను జనసేన కోసం నిర్వహిస్తున్నట్టు రెండు ప్రధాన పార్టీలు నిర్ధారణకు వచ్చాయి. ఈ సభ రాజకీయ ఎజెండాతో జరుగుతోందని వైసీపీ, టీడీపీ నేతలు చెబుతున్నారు.

ఫ్లెక్సీలపైనా వంగ వీటి రంగాతో పాటు పవన్‌ కల్యాణ్ ఫొటోను ప్రముఖంగా ముద్రించారు. ఆవిష్కరించిన పోస్టర్లపైనా పవన్‌ కల్యాణ్, చిరంజీవి బొమ్మలను పెద్దగా ముద్రించి.. ఇతర పార్టీల్లోని కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఫోటోలను మాత్రం చిన్నగా ముద్రించడం కూడా వివాదానికి కారణమైంది. కాపును ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్‌తోనే ఈ సభ నిర్వహిస్తున్నట్టు కూడా ప్రచారం మొదలవడంతో రెండు పార్టీలు అప్రమత్తమయ్యాయి.

పైగా జనసేన నుంచి ఎక్కువగా జనసమీకరణ జరుగుతోంది. అలాంటి మీటింగ్‌కు వైసీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరైతే వారు అడ్డుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులను ఘెరావ్ చేసి.. దాన్ని వైసీపీపై కాపుల ఆగ్రహంగా ప్రచారం చేయాలన్న ఆలోచన కూడా ఉందన్న అనుమానం వైసీపీలో ఉంది.

రాజకీయాలకు అతీతం అని తొలుత చెప్పినప్పటికీ ఆఖరిలో జనసమీరణ జనసేన నుంచి ఎక్కువగా జరుగుతోందన్న అనుమానం ఉంది. పోస్టర్ ఆవిష్కరించిన గంటా శ్రీనివాస్ హాజరవుతారా లేదా అన్న దానిపై అందరి దృష్టి ఉంది.

Tags:    
Advertisement

Similar News