వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్‌పై ఐటీ దాడులు

భూమికి సంబంధించి సాగిన ఆర్థిక లావాదేవీలపై అనుమానంతోనే ఐటీ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వల్లభనేని వంశీ నివాసాలు, ఆఫీసుల్లోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.

Advertisement
Update: 2022-12-06 06:29 GMT

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ నేత దేవినేని అవినాష్ నివాసాలు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఒక భూమి వ్యవహారం ఈ ఐటీ దాడులకు మూలంగా చెబుతున్నారు. బంజారాహిల్స్‌లోని దేవినేని అవినాష్‌కు చెందిన భూమిని డెవలప్‌మెంట్‌ కోసం వంశీరాం బిల్డర్స్‌ సంస్థ తీసుకుంది.

ఈ భూమికి సంబంధించి సాగిన ఆర్థిక లావాదేవీలపై అనుమానంతోనే ఐటీ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వల్లభనేని వంశీ నివాసాలు, ఆఫీసుల్లోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.

విజయవాడ, హైదరాబాద్‌లో ఐటీ అధికారులు త‌నిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని వంశీరాం బిల్డర్స్ చైర్మన్‌ తిక్కవరపు సుబ్బారెడ్డి, డైరెక్టర్‌ జనార్ద‌న్ రెడ్డి నివాసాలు, ఆఫీసుల్లోనూ ఉదయం నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. మొత్తం 36 ప్రాంతాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వంశీరాం బిల్డర్స్‌లో అవినాష్ పెట్టుబడులు కూడా పెట్టినట్టు అనుమానిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News