మొద‌లైన భ‌యం.. పిఠాపురానికి చిరంజీవి..

మరోవైపు వైసీపీ అభ్యర్థి వంగా గీతకు ప్రజాదరణ పెరుగుతోంది. ఆమె స్థానికురాలు. ప్రజలకు అందుబాటులో ఉంటారు. నోటిఫికేషన్ రావడానికి ముందునుంచే నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు.

Advertisement
Update: 2024-04-26 12:21 GMT

సీఎం జగన్‌ను గద్దె దించుతాం అని ప్రగల్భాలు పలుకుతున్న పవన్‌ కల్యాణ్‌కు ఓటమి భయం పట్టుకుంది. స్థానిక టీడీపీ నేత వర్మ చివరి వరకు తనతో సరిగా ఉంటాడా? చివరిలో దెబ్బేస్తాడా అని పవన్ ఆందోళనకు గురువుతున్నాడు. వాస్తవానికి తన సీటును అప్పనంగా దొబ్బేసిన పవన్‌ను గెలిపించి మోయాల్సిన అవసరం వర్మకు ఏముంది?. అందుకే చివర్లో కాడి పడేస్తాడేమో అని పవన్‌లో భయం మొదలైందట. ఒకవేళ వర్మ గానీ హ్యాండిస్తే మళ్ళీ తనకు గాజువాక, భీమవరం ఫలితాలు రిపీట్ అవుతాయేమో అని పవన్‌ వణికిపోతున్నారట. అప్పుడెప్పుడో ఇండిపెండెంట్‌గా గెలిచిన వర్మకు పిఠాపురంలో అదేస్థాయి ప్రజాదరణ ఉందన్న గ్యారంటీ కూడా లేదు.

వంగా గీతకు పెరుగుతున్న ఆదరణ..

మరోవైపు వైసీపీ అభ్యర్థి వంగా గీతకు ప్రజాదరణ పెరుగుతోంది. ఆమె స్థానికురాలు. ప్రజలకు అందుబాటులో ఉంటారు. నోటిఫికేషన్ రావడానికి ముందునుంచే నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. పవన్‌ ఏమో జ్వరం వస్తేనే హైదరాబాద్‌కు వెళ్లి నాలుగు రోజులు రెస్ట్ తీసుకుని వచ్చాడు. నిలకడలేని మనస్తత్వానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన పవన్ కల్యాణ్.. రేపు పొరపాటున గెలిచినా పిఠాపురంలోనే ఉంటాడన్న గ్యారంటీ లేదు. దీంతో లోకల్‌ అభ్యర్థిని వదిలిపెట్టి పవన్‌ను ఎందుకు మోయాలన్న అభిప్రాయం జనాల్లో వ్యక్తం అవుతోంది.

ప్లీజ్ అన్నయ్య గెలిపించు..

తన సత్తా ఒక్కటే సరిపోదు, అన్నయ్య చిరంజీవి పాపులారిటీ కూడా ఉంటే తప్ప గెలిచే పరిస్థితి లేదని పవన్‌ గ్రహించాడు. అందుకే అన్నయ్యను ప్రచారానికి పిలిచారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఇక ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయను అని గతంలో చెప్పిన చిరు ఈమధ్యే మాట మార్చారు. పంచకర్ల రమేష్, సీఎం రమేష్‌లను పక్కన కూర్చోబెట్టుకుని మరీ కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే మే 5న పిఠాపురంలో చిరంజీవి ప్రచారం చేస్తారని తెలుస్తోంది. అలాగే ఆంధ్రాలో జరిగే ప్రధాని సభలు, రోడ్ షోల్లోనూ చిరంజీవి పాల్గొంటారని చెబుతున్నారు.

Advertisement

Similar News