అప్పుడు కాపు, ఇప్పుడు బీసీ.. ఇంతకీ పవన్ కులమేంటి..?

జగన్ అనే సింహం సింగిల్‌గా వస్తుందని, 2024 ఎన్నికల్లో 175 సీట్లు వైసీపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. పవన్ పనికిమాలిన నాయకుడని, ఎమ్మెల్యేగా గెలవలేని దద్దమ్మ అంటూ ఎద్దేవా చేశారు వెల్లంపల్లి.

Advertisement
Update: 2023-03-12 10:15 GMT

అప్పుడు కాపు, ఇప్పుడు బీసీ.. ఇంతకీ పవన్ కులమేంటి..?

పవన్ కల్యాణ్ బీసీ సభ పెట్టినప్పుడే వైసీపీ నుంచి కౌంటర్లు మొదలవుతాయని అనుకున్నారంతా. అదే నిజమని రుజువైంది. పవన్ బీసీ మీటింగ్ అయిపోయిన వెంటనే వైసీపీనేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ కులమో చెప్పుకోలేని వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ తీవ్రంగా విమర్శించారు. అప్పుడేమో కాపు అన్నాడు, నిన్న తాను బీసీ అంటున్నాడు, ఇంతకీ పవన్ ది ఏ కులం అని ప్రశ్నించారు వెల్లంపల్లి.


చిరంజీవి ప్రజారాజ్యం ఓడిపోయిన తర్వాతి రోజే అన్నను వదిలేసిన స్వార్థ పరుడు పవన్ కల్యాణ్ అని విమర్శించారు. జనసేన పెట్టిన పదేళ్లలో ఒక్క సర్పంచ్‌ ను కూడా గెలిపించుకోలేక పోయారని సెటైర్లు వేశారు.

భజన పార్టీ, పనికిమాలిన పార్టీ..

జనసేన 10వ ఆవిర్భావ సభకు మచిలీపట్నంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ పదేళ్లలో జనసేన ఏం సాధించిందని ప్రశ్నించారు వెల్లంపల్లి. జనసేన పనికిమాలిన పార్టీ అని, చంద్రబాబుకు భజన చేసే పార్టీ అని విమర్శించారు. ప్యాకేజీకి అమ్ముడుబోయే పార్టీ, చంద్రబాబుకు ఊడిగం చేసే పార్టీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఊసరవెల్లికి మారుపేరు పవన్..

పవన్ కల్యాణ్ రోజుకోమాట, పూటకో వేషం వేస్తుంటారని, ఊసరవెల్లికి అసలు సిసలు నిర్వచనం ఆయన అని అన్నారు వెల్లంపల్లి. సీఎం జగన్ సవాల్ చేసిన విధంగా రాష్ట్రంలో సింగిల్‌ గా 175 స్దానాల్లో పోటీ చేసే దమ్ము టీడీపీ లేదా జనసేనకు ఉందా..? అని ప్రశ్నించారు.


జగన్ అనే సింహం సింగిల్‌గా వస్తుందని, 2024 ఎన్నికల్లో 175 సీట్లు వైసీపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ పనికిమాలిన నాయకుడని, ఎమ్మెల్యేగా గెలవలేని దద్దమ్మ అంటూ ఎద్దేవా చేశారు వెల్లంపల్లి.

Tags:    
Advertisement

Similar News