కత్తి దూసి, తంబుర మీటి.. కర్నూలు 'సిద్ధం' స్పెషల్

భారీ గజమాలతో వచ్చిన వారిని నిరాశపరచకుండా బస్సు ఆపి మరీ వారి దగ్గరకు వెళ్లారు సీఎం జగన్. నేతన్నలు ఇచ్చిన పంచె, చీరను ఆప్యాయంగా తీసుకున్నారు, వారికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Update: 2024-03-29 12:32 GMT

'సిద్ధం' వేరు, 'మేమంతా సిద్ధం' వేరు.. వేటికవే వెరీ వెరీ స్పెషల్. రాష్ట్రవ్యాప్తంగా 4 సిద్ధం సభలు విజయవంతం అయిన తర్వాత వైసీపీకి పెరిగిన క్రేజ్ వేరు. 'మేమంతా సిద్ధం' పేరుతో జగన్ జనంలోకి వెళ్తున్నప్పుడు పార్టీపై పెల్లుబుకుతున్న అభిమానం వేరు. జగన్ బస్ యాత్రకు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు ప్రజలు. కర్నూలు జిల్లాలో బస్ యాత్రలో దారి పొడవునా ప్రజలకు ఆయన అభివాదం తెలిపారు. బస్సు ఆపి మరీ ఆయన ప్రజల వద్దకు వెళ్లారు, వారిచ్చిన చిరు కానుకలు స్వీకరించి వారిని ఆనందపరిచారు.

గొర్రె పిల్లను ఎత్తుకున్నారు, తంబుర మీటారు, కత్తి దూశారు, చేనేత కార్మికులు ఇచ్చిన మగ్గం నమూనా దగ్గర నిలబడి ఫొటోలు దిగారు జగన్. బస్ యాత్రలో ఈరోజు ఇవే ప్రత్యేక ఆకర్షణలు. భారీ గజమాలతో వచ్చిన వారిని నిరాశపరచకుండా బస్సు ఆపి మరీ వారి అభిమానాన్ని మన్నించారు. నేతన్నలు ఇచ్చిన పంచె, చీరను ఆప్యాయంగా తీసుకున్నారు, వారికి ధన్యవాదాలు తెలిపారు.

బాబు, పవన్ కు అంత సీనుందా..?

జగన్ కంటే ముందే పవన్, చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లారు. కాస్త ఆలస్యంగా జగన్ బస్ యాత్ర ద్వారా జనం మధ్యకు వచ్చారు. కానీ ఇక్కడ కనపడుతున్న అభిమానం వేరు. చంద్రబాబు, పవన్ వచ్చినప్పుడు కూడా వారిని చూసేందుకు జనం వచ్చినా.. దగ్గరకు వచ్చి ఆప్యాయంగా వారిని ఆలింగనం చేసుకున్న ఉదాహరణలు లేవు. కానీ జగన్ అంటే మన కుటుంబ సభ్యుడు అనే భావన ప్రజల్లో ఉంది. అందుకే ఓ తల్లికి కొడుకుగా, మరో అక్కకు తమ్ముడిగా, ఇంకో చిన్నారికి మేనమామగా కనిపిస్తున్నారు జగన్. ఆ అభిమానం చూసి తనకు తాను ఎమోషనల్ అయి ట్వీట్లు పెడుతున్నారు జగన్. "అవ్వా తాతలకి భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం మనది. అవ్వాతాతల సంక్షేమం కోసం వారికి ఇచ్చే పెన్షన్‌ను రూ.3000కు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మనం చేసిన మంచి దారిపొడువునా వారు చూపిస్తున్న అభిమానంలో కనిపిస్తుంది." అంటూ ఓ అవ్వను హత్తుకున్న ఫొటోని ట్విట్టర్లో షేర్ చేశారు జగన్. 



Tags:    
Advertisement

Similar News