ఈటల రాజీనామా ఆమోదం

ఈటల రాజేందర్​ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్​ చేసినప్పటినుంచి తెలంగాణ లో రాజకీయాలు హాట్​ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 14న ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఈటల రాజేందర్​ హైదరాబాద్​లోని గన్​పార్కుకు చేరుకొని .. అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి, […]

Advertisement
Update: 2021-06-12 05:12 GMT

ఈటల రాజేందర్​ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్​ చేసినప్పటినుంచి తెలంగాణ లో రాజకీయాలు హాట్​ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 14న ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోన్నారు.

ఈ నేపథ్యంలో ఇవాళ ఈటల రాజేందర్​ హైదరాబాద్​లోని గన్​పార్కుకు చేరుకొని .. అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్​, తుల ఉమ తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన ఈటల రాజేందర్​ .. ఇవాళ స్పీకర్ కార్యాలయానికి చేరుకుని అక్కడ కార్యదర్శికి రాజీనామా లేఖ అందించారు. అనంతరం స్పీకర్​కు ఫ్యాక్స్ లో రాజీనామాను పంపించారు. ఆయన రాజీనామాను స్పీకర్​ వెంటనే ఆమోదించారు.

ఈటల రాజేందర్​తోపాటు ఆర్టీసీ ఉద్యమ నేత అశ్వత్ధామ రెడ్డి తదితరులు ఈటల వెంట ఢిల్లీ వెళ్లబోతున్నట్టు సమాచారం. ఈటల రాజేందర్​ తన అనుచరులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లబోతున్నట్టు తెలిసింది. ఇక ఇవాళ గన్​ పార్క్​ వద్ద నివాళి అర్పించిన ఈటల రాజేందర్​ సీఎం కేసీఆర్​పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కురుక్షేత్ర యుద్ధం మొదలైనట్టేనని వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ’

హుజురాబాద్​లో కౌరవులకు, పాండవులకు మధ్య యుద్ధం జరగబోతుంది. ఈ పోరాటం.. కేసీఆర్ కుటుంబానికి యావత్​ తెలంగాణ ప్రజానికానికి మధ్య జరుగుతోంది. నేను హుజూరాబాద్​లో పాదయాత్ర చేస్తా. నా ప్రజలంతా నా వెంటే ఉన్నారు.

నిర్భందాలు నాకు కొత్త కాదు. రాష్ట్రంలో కరోనాతో చనిపోతుంటే పట్టించుకోరు. వడ్లు మొలకెత్తుతున్నా ధాన్యం కొనేవాళ్లు లేరు. కానీ నా మీద విచారణ జరిపేందుకు మాత్రం వందల మంది అధికారులను వినియోగించుకుంటున్నారు. ’ అంటూ ఈటల రాజేందర్​ ఉద్వేగంతో మాట్లాడారు.

Tags:    
Advertisement

Similar News