మహిళా ప్రపంచకప్ కు సచిన్ ప్రచారం

ప్రపంచ అతిపెద్ద క్రికెట్ వేదికలో ఫైనల్స్ ఆస్ట్ర్రేలియా వేదికగా మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న 2020 మహిళా టీ-20 ప్రపంచకప్ ప్రచారబాధ్యతలను భారత క్రికెటర్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ సైతం తన భుజాన వేసుకొన్నాడు. అంతంత మాత్రమే ఆదరణ ఉన్న మహిళా క్రికెట్ కు మరింత మంది అభిమానులను, ఆదరణను తీసుకురావడానికి సచిన్ తనవంతుగా పాటుపడుతున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం వేదికగా పేరుపొందిన మెల్బోర్న్ లో తొలిసారిగా మహిళా క్రికెట్ పైనల్స్ సమరం నిర్వహించబోతున్నారు. లక్షకు పైగా అభిమానులు ఏకకాలంలో […]

Advertisement
Update: 2020-02-07 23:40 GMT
  • ప్రపంచ అతిపెద్ద క్రికెట్ వేదికలో ఫైనల్స్

ఆస్ట్ర్రేలియా వేదికగా మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న 2020 మహిళా టీ-20 ప్రపంచకప్ ప్రచారబాధ్యతలను భారత క్రికెటర్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ సైతం తన భుజాన వేసుకొన్నాడు.

అంతంత మాత్రమే ఆదరణ ఉన్న మహిళా క్రికెట్ కు మరింత మంది అభిమానులను, ఆదరణను తీసుకురావడానికి సచిన్ తనవంతుగా పాటుపడుతున్నాడు.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం వేదికగా పేరుపొందిన మెల్బోర్న్ లో తొలిసారిగా మహిళా క్రికెట్ పైనల్స్ సమరం నిర్వహించబోతున్నారు.

లక్షకు పైగా అభిమానులు ఏకకాలంలో స్టేడియంలో కూర్చొని మ్యాచ్ ను వీక్షించే అవకాశం కేవలం మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో మాత్రమే ఉంది. గత ప్రపంచకకప్ వరకూ 20వేల సీటింగ్ సామర్థ్యం మాత్రమే ఉన్న వేదికల్లో జరిగిన మహిళా ప్రపంచకప్ ను తొలిసారిగా భారీ స్టేడియాలలో నిర్వహించడానికి ఐసీసీ ఏర్పాట్లు చేసింది. పురుషులతో సమానంగా మహిళా క్రికెట్ కు ప్రచారం, ఆదరణ తీసుకురావడం కోసం ప్రత్యేకచర్యలు తీసుకొంది.

ఫిబ్రవరి 21న ప్రారంభంకానున్న ఈ దశాబ్దపు తొలి మహిళా ప్రపంచకప్ టీ-20 సమరంలో భారత్ తో సహా 10 అగ్రశ్రేణి జట్లు ఢీ కొనబోతున్నాయి. మెల్బోర్న్ వేదికగా జరిగే ఫైనల్స్ కు తొలిసారిగా లక్షమందికి పైగా అభిమానులు హాజరయ్యే అవకాశం ఉందని ఆస్ట్ర్రేలియా క్రికెట్ బోర్డు అంచనా వేస్తోంది.

మహిళా ప్రపంచకప్ ప్రారంభ, ముగింపు వేడుకల్లో విఖ్యాత గాయని కేటే పెర్రీ సైతం తన ఆటపాటతో అలరించనుంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ సైతం మహిళా ప్రపంచకప్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రచారం చేస్తున్నారు.

మహిళా ప్రపంచకప్ లో పాల్గొంటున్న ప్రపంచ మూడోర్యాంక్ భారతజట్టుకు డాషింగ్ హిట్టర్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తోంది.

Tags:    
Advertisement

Similar News