క్రికెట్ కు ఇర్ఫాన్ పఠాన్ గుడ్ బై

చిన్నవయసులోనే రిటైర్మెంట్ పట్ల ఆవేదన భారత మాజీ ఆల్ రౌండర్ , బరోడా బాంబర్ ఇర్ఫాన్ పఠాన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అందరు క్రికెటర్లూ 27 సంవత్సరాల వయసులో కెరియర్ ప్రారంభించి 35 సంవత్సరాల వరకూ ఆడుతున్నారని…తాను మాత్రం 27 ఏళ్ల వయసులో ఆఖరి మ్యాచ్ ఆడటం ఆవేదన కలిగించిందని ఇర్ఫాన్ పఠాన్ ప్రకటించాడు. భారతజట్టులో తనకు చోటు దక్కకపోవడం, దేశవాళీ క్రికెట్లో ఆశించినస్థాయిలో రాణించలేకపోడం, ఐపీఎల్ వేలంలో తనను ఏ ఫ్రాంచైజీ పట్టించుకోకపోడంతో.. గత్యంతరం లేని పరిస్థితిలోనే […]

Advertisement
Update: 2020-01-04 23:38 GMT
  • చిన్నవయసులోనే రిటైర్మెంట్ పట్ల ఆవేదన

భారత మాజీ ఆల్ రౌండర్ , బరోడా బాంబర్ ఇర్ఫాన్ పఠాన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అందరు క్రికెటర్లూ 27 సంవత్సరాల వయసులో కెరియర్ ప్రారంభించి 35 సంవత్సరాల వరకూ ఆడుతున్నారని…తాను మాత్రం 27 ఏళ్ల వయసులో ఆఖరి మ్యాచ్ ఆడటం ఆవేదన కలిగించిందని ఇర్ఫాన్ పఠాన్ ప్రకటించాడు.

భారతజట్టులో తనకు చోటు దక్కకపోవడం, దేశవాళీ క్రికెట్లో ఆశించినస్థాయిలో రాణించలేకపోడం, ఐపీఎల్ వేలంలో తనను ఏ ఫ్రాంచైజీ పట్టించుకోకపోడంతో.. గత్యంతరం లేని పరిస్థితిలోనే ఇర్పాన్ పఠాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

కింగ్ ఆఫ్ స్వింగ్ ఇర్ఫాన్..

బరోడాలోని ఓ మసీదు దగ్గర సాంబ్రాణి పుల్లలు విక్రయించే ఓ చిరువ్యాపారి కుటుంబం నుంచి వచ్చిన ఇర్ఫాన్ 19 సంవత్సరాల చిరుప్రాయంలోనే భారతజట్టులో చోటు సంపాదించాడు.

ఎడమచేతివాటం స్వింగ్ బౌలర్ గా, దూకుడుగా ఆడే ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు. భారత్ తరపున 29 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 1105 పరుగులు, 100 వికెట్లు సాధించిన మొనగాడిగా నిలిచాడు.

120 వన్డేలలో 1544 పరుగులు, 173 వికెట్లు, 24 టీ-20మ్యాచ్ ల్లో 172 పరుగులు, 28 వికెట్ల రికార్డు సాధించాడు. 27 సంవత్సరాల వయసులో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఇర్ఫాన్ కు ఆ తర్వాత నుంచి అవకాశాలు లేకుండాపోయాయి. దానికితోడు అతని ఆటతీరులోనూ వాడివేడి తగ్గిపోయాయి.

సెలెక్టర్లు తనకు మరిన్ని అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించి ఉంటే 500కు పైగా వికెట్లు పడగొట్టి ఉండేవాడినని, 19 సంవత్సరాలలో కెరియర్ ప్రారంభించిన తాను 27 సంవత్సరాల వయసులో చివరి మ్యాచ్ ఆడటం బాధను కలిగించిందని తన రిటైర్మెంట్ ప్రకటనలో వాపోయాడు.

2006లో పాక్ తో ఆడిన కరాచీ టెస్టులో హ్యాట్రిక్ సాధించడం, 2007 ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన భారతజట్టులో సభ్యుడు కావడం తన కెరియర్ లోని అద్భుత ఘట్టాలని ఇర్ఫాన్ గుర్తు చేసుకొన్నాడు.

మొత్తం మీద బరోడా బాంబర్ ఇర్ఫాన్ పఠాన్ కెరియర్ ఎనిమిది సంవత్సరాలకే ముగిసిపోయింది.

Tags:    
Advertisement

Similar News