కొండా సురేఖ, కడియం కావ్య ముందే.. రెచ్చిపోయారు..

వరంగల్‌ కాంగ్రెస్‌లో ఈ ఫైటింగులు కొత్తేం కాదు. అధికారంలోకి వచ్చి 5నెలలు కాకముందే హస్తం నేతలు రెచ్చిపోతున్నారు. గతంలో పరకాల మండలం కామారెడ్డిపల్లిలో జరిగిన మీటింగ్‌లోనూ కడియం శ్రీహరి, కావ్య ముందే నేతలు పొట్టుపొట్టు కొట్టుకున్నారు.

Advertisement
Update: 2024-05-02 12:33 GMT

వరంగల్ కాంగ్రెస్‌లో గ్రూప్ విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. వరంగల్ తూర్పు, వర్ద‌న్నపేటలో పదవుల కోసం కాంగ్రెస్ నేతలు ఫైటింగ్‌కు దిగారు. వరంగల్ తూర్పులో కడియం కావ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ ముందే కాంగ్రెస్ లీడర్లు గొడవపడ్డారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వొద్దని సీనియ‌ర్ నాయ‌కులు గొడవకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

ఫైటింగులే.. ఫైటింగులు..

అలాగే వర్ద‌న్నపేటలోనూ కాంగ్రెస్ నేతలు గొడవకు దిగారు. కడియం శ్రీహరి, కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముందే ఈ ఫైటింగ్ జరిగింది. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాత లీడర్లు, కొత్త లీడర్లుగా ఇలా రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు.

టెన్షన్‌లో కడియం కావ్య..

వరంగల్‌ కాంగ్రెస్‌లో ఈ ఫైటింగులు కొత్తేం కాదు. అధికారంలోకి వచ్చి 5నెలలు కాకముందే హస్తం నేతలు రెచ్చిపోతున్నారు. గతంలో పరకాల మండలం కామారెడ్డిపల్లిలో జరిగిన మీటింగ్‌లోనూ కడియం శ్రీహరి, కావ్య ముందే నేతలు పొట్టుపొట్టు కొట్టుకున్నారు. ఎంత చెప్పినా వినకపోవడంతో ఆ ఎన్నికల సన్నాహక సమావేశం అర్థాంతరంగా ముగిసింది. అంతకుముందు స్టేషన్‌ఘన్‌పూర్‌లోనూ సేమ్ సీన్ రిపీటైంది. కాంగ్రెస్ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు దిగారు. దీంతో కడియం శ్రీహరి, కావ్య మీటింగ్ మధ్యలోంచే వెళ్లిపోయారు. ఇలా సొంతపార్టీలోనే ఫైటింగులు కడియం కావ్యకు, శ్రీహరికి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఓటమి తప్పేలా లేదనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

Tags:    
Advertisement

Similar News