కటక్ వన్డేలో విరాట్ కొహ్లీ టాప్

చెత్త రికార్డును సరిచేసిన విరాట్ భారత కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీకి వన్డే క్రికెట్లో అత్యంత నిలకడగా రాణించే ఆటగాడిగా పేరున్నా… కటక్ బారాబటీ స్టేడియం వేదికగా భారీస్కోరు సాధించిన రికార్డు మాత్రం లేదు. అయితే ..ఆ లెక్కను వెస్టిండీస్ తో ముగిసిన ఆఖరి వన్డే ద్వారా కొహ్లీ సరిచేశాడు. కటక్ వేదికగా ఇంతకు ముందు ఆడిన మూడు వన్డేలు, ఓ టీ-20 మ్యాచ్ లో కలసి 34 పరుగులు మాత్రమే సాధించిన […]

Advertisement
Update: 2019-12-22 22:12 GMT
  • చెత్త రికార్డును సరిచేసిన విరాట్

భారత కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీకి వన్డే క్రికెట్లో అత్యంత నిలకడగా రాణించే ఆటగాడిగా పేరున్నా… కటక్ బారాబటీ స్టేడియం వేదికగా భారీస్కోరు సాధించిన రికార్డు మాత్రం లేదు. అయితే ..ఆ లెక్కను వెస్టిండీస్ తో ముగిసిన ఆఖరి వన్డే ద్వారా కొహ్లీ సరిచేశాడు.

కటక్ వేదికగా ఇంతకు ముందు ఆడిన మూడు వన్డేలు, ఓ టీ-20 మ్యాచ్ లో కలసి 34 పరుగులు మాత్రమే సాధించిన కొహ్లీ.. ప్రస్తుత సిరీస్ ఆఖరాటలో మాత్రం 85 పరుగులతో టాప్ స్కోరర్ గా మాత్రమే కాదు…మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సైతం సొంతం చేసుకోగలిగాడు.

ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండువన్డేలలో కొహ్లీ 4, 0 స్కోర్లు మాత్రమే సాధించగలిగాడు. అంతేకాదు…కటక్ బారాబటీ స్టేడియం వేదికగా గతంలో ఆడిన వన్డేల్లో విరాట్ కొహ్లీకి 3, 22, 1, 8 స్కోర్లు మాత్రమే ఉన్నాయి. అయితే 2019 సీజన్ ఆఖరి వన్డేలో కొహ్లీ 81 బాల్స్ లోనే 9 బౌండ్రీలతో 85 పరుగులు సాధించడం ద్వారా ఆలోటును పూడ్చుకోగలిగాడు

కటక్ వేదికగా 13-4 రికార్డు…

కటక్ బారాబటీ స్టేడియం వేదికగా భారత్ ఇప్పటి వరకూ ఆడిన మొత్తం 17 వన్డేల్లో 13 విజయాలు, 4 పరాజయాల రికార్డుతో ఉంది. బారాబటీ స్టేడియం చరిత్రలో…ఓ వన్డే మ్యాచ్ లో 631కు పైగా పరుగులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

విండీస్ చేజారిన గోల్డెన్ చాన్స్

భారత్ ను భారతగడ్డపై వన్డే సిరీస్ లో 17 సంవత్సరాల తర్వాత ఓడించే అవకాశాన్ని కరీబియన్ టీమ్ సద్వినియోగం చేసుకోలేకపోయింది.

2002 లో భా్రత్ ప్రత్యర్థిగా…భారత గడ్డపై జరిగిన ద్వైపాక్షిక సిరీస్ ను చివరిసారిగా నెగ్గిన రికార్డు కరీబియన్ జట్టుకు ఉంది.

ఆ తర్వాత నుంచి గత 17 సంవత్సరాలుగా భారత్ వేదికగా జరిగిన వన్డే, టీ-20 సిరీస్ ల్లో కరీబియన్ టీమ్ కు వరుస పరాజయాలు తప్పడం లేదు.

2003 నుంచి 2019 వరకూ భారతగడ్డపై విండీస్ ప్రత్యర్థిగా భారత్ వరుసగా 10 కి 10 ద్వైపాక్షిక సిరీస్ లు నెగ్గిన రికార్డు ఉంది.

Tags:    
Advertisement

Similar News