అమ్మ రాజ్యంలో కడప బిడ్డలకు మళ్లీ అడ్డంకులు...

వివాదాస్పద దర్శకుడు వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రానికి చిక్కులు తప్పడం లేదు. ఈ నెల 12న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే సెన్సార్ బోర్డ్ నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు. దాంతో చిత్ర యూనిట్ సెన్సార్ బోర్డ్ వద్ద ఆందోళనకు దిగింది. టీడీపీ నేతలు లంచం ఇచ్చి సినిమాను అడ్డుకుంటున్నారని నిర్మాత నట్టి కుమార్ ఆరోపించారు. సెన్సార్ బోర్డు నుంచి రాజశేఖర్ సినిమా చూసి రివైజింగ్ కమిటీకి […]

Advertisement
Update: 2019-12-11 05:03 GMT

వివాదాస్పద దర్శకుడు వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రానికి చిక్కులు తప్పడం లేదు. ఈ నెల 12న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే సెన్సార్ బోర్డ్ నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు.

దాంతో చిత్ర యూనిట్ సెన్సార్ బోర్డ్ వద్ద ఆందోళనకు దిగింది. టీడీపీ నేతలు లంచం ఇచ్చి సినిమాను అడ్డుకుంటున్నారని నిర్మాత నట్టి కుమార్ ఆరోపించారు. సెన్సార్ బోర్డు నుంచి రాజశేఖర్ సినిమా చూసి రివైజింగ్ కమిటీకి రిఫర్ చేశారని, కట్స్ సబ్మిట్ అడిగారని చెప్పారు. మొత్తం సబ్మిట్ చేసినా ఇప్పటి వరకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు.

ఎంపీ సుజనా చౌదరి ఈ అడ్డంకులు సృష్టిస్తున్నారని నట్టి కుమార్ ఆరోపించారు. టీడీపీ నేతలు రూ. 50 లక్షలు ఇచ్చి సినిమా విడుదల కాకుండా ఆపుతున్నారని ఆరోపించారు.

సెన్సార్‌బోర్డు రీజినల్ ఆఫీసర్ రాజశేఖర్ తమను 50 లక్షలు డిమాండ్ చేశారని… అది ఇవ్వకపోవడంతో అడ్డంకులు సృష్టిస్తున్నారని నట్టి కుమార్ ఆరోపించారు. రాజశేఖర్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

ఈ నేపథ్యంలో సినిమా రేపు విడుదల అవుతుందో లేదో చూడాలి.

Tags:    
Advertisement

Similar News