చంద్ర గ్రహణం.. వైసీపీ వినూత్న ప్రచారం

రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టిందని, జూన్-4న ఆ గ్రహణం వీడుతుందని ప్రచారం మొదలు పెట్టింది వైసీపీ.

Advertisement
Update: 2024-05-07 10:41 GMT

సిద్ధం, మేమంతా సిద్ధం, జగన్ కోసం సిద్ధం.. అంటూ వైసీపీ వినూత్న ప్రచార కార్యక్రమాలను తెరపైకి తెచ్చింది. అయితే అందులో విమర్శలేవీ లేవు, కేవలం తాము చేసింది చెప్పుకున్నారు, చేయాల్సినదాని గురించి వివరించారు, తమకు ఎందుకు ఓటు వేయాలనే విషయాన్ని విడమరచి చెప్పారు. అయితే ఇప్పుడు విమర్శలతో కూడా వైసీపీ వినూత్న ప్రచారాలను చేపట్టింది. చంద్ర గ్రహణం అంటూ సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది.


అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని, వంచించారని, సంపదనంతా కొల్లగొట్టి తన అనుయాయులకు పంచి పెట్టారనేది వైసీపీ చేసే ప్రధాన ఆరోపణ. అయితే అధికారంలో లేకపోయినా చంద్రబాబు ఎలాంటి దుర్మార్గాలు చేయగలరనే విషయాన్ని ఇప్పుడు చెబుతున్నారు వైసీపీ నేతలు. ఎన్నికల కారణంగా నిర్ణయాధికారాలన్నీ ఈసీ చేతుల్లోకి వెళ్లడంతో చంద్రబాబులోని శాడిస్ట్ బయటకొచ్చారు. పెన్షన్ల వ్యవహారంలో పేదల్ని ఇబ్బంది పెట్టారు. డీబీటి పద్ధతిలో లబ్ధిదారులకు రావాల్సిన సొమ్ముని అడ్డుకున్నారు. బదిలీల పేరుతో అధికారుల్ని ఇబ్బంది పెడుతున్నారు.. ఇలా ఆయన చాలా దారుణాలు చేస్తున్నారని ఆరోపిస్తోంది వైసీపీ. రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టిందని, జూన్-4న ఆ గ్రహణం వీడుతుందని ప్రచారం మొదలు పెట్టింది.

పేద అక్క చెల్లెమ్మలకు డబ్బులు అందకుండా వారి కడుపుకొట్టిన చంద్రబాబు..

అక్కసుతో ఇన్ పుట్ సబ్సిడీ అడ్డుకుని అన్నదాతల నోట్లో మట్టికొట్టిన చంద్రబాబు..

పెత్తందారీ బుద్ధితో పేద విద్యార్థులకు అందాల్సిన విద్యా దీవెన డబ్బుని అడ్డుకున్న చంద్రబాబు.

కపట బుద్ధితో పెన్షన్ తీసుకునే అవ్వాతాతల్ని ఇబ్బంది పెట్టిన చంద్రబాబు..

ఇలా చంద్రబాబు వల్ల ఈ కాస్త టైమ్ లోనే రాష్ట్రానికి, ప్రజలకు ఎంత చెడు జరిగిందో వైసీపీ వివరిస్తోంది. చంద్ర గ్రహణం ఫలితంగానే ఈ చెడు జరుగుతోందని, మే 13న వైసీపీకి ఓటు వేసి ప్రజలు ఈ గ్రహణ విముక్తి కలిగించాలని అంటున్నారు. జూన్-4న గ్రహణం విడిచిపోతుందని, అప్పటి నుంచి ఏపీ ప్రజలకు అన్నీ మంచిరోజులేనని చెబుతున్నారు వైసీపీ నేతలు. 

Tags:    
Advertisement

Similar News