శాఫ్ గేమ్స్ కుస్తీలో భారత్ బంగారు పంట

భారత వస్తాదులకు 12 కు 12 బంగారు పతకాలు 2019 దక్షిణాసియా క్రీడల కుస్తీ పురుషుల, మహిళల విభాగంలో భారత్ కు ఎదురేలేకుండా పోయింది. నేపాల్ రాజధాని ఖట్మండూ వేదికగా జరుగుతున్న 13వ శాఫ్ గేమ్స్ కుస్తీ విభాగంలో …మొత్తం 12కు 12 బంగారు పతకాలూ భారత వస్తాదులే గెలుచుకొన్నారు. పోటీకి దిగిన ప్రతివిభాగంలోనూ భారత్ కే స్వర్ణపతకాలు దక్కాయి. మహిళలవిభాగంలో భారత స్టార్ వస్తాదు, ఒలింపిక్ కాంస్య విజేత సాక్షీ మాలిక్ విజేతగా నిలిచింది. పురుషుల ఫ్రీ-స్టయిల్ 61 […]

Advertisement
Update: 2019-12-08 20:52 GMT
  • భారత వస్తాదులకు 12 కు 12 బంగారు పతకాలు

2019 దక్షిణాసియా క్రీడల కుస్తీ పురుషుల, మహిళల విభాగంలో భారత్ కు ఎదురేలేకుండా పోయింది. నేపాల్ రాజధాని ఖట్మండూ వేదికగా జరుగుతున్న 13వ శాఫ్ గేమ్స్ కుస్తీ విభాగంలో …మొత్తం 12కు 12 బంగారు పతకాలూ భారత వస్తాదులే గెలుచుకొన్నారు.

పోటీకి దిగిన ప్రతివిభాగంలోనూ భారత్ కే స్వర్ణపతకాలు దక్కాయి. మహిళలవిభాగంలో భారత స్టార్ వస్తాదు, ఒలింపిక్ కాంస్య విజేత సాక్షీ మాలిక్ విజేతగా నిలిచింది.

పురుషుల ఫ్రీ-స్టయిల్ 61 కిలోల విభాగంలో భారత యువవస్తాదు రవీందర్ స్వర్ణ పతకం ఖాయం చేసుకొన్నాడు. బంగారు పతకాలు సాధించిన భారత ఇతర వస్తాదుల్లో అన్షు, పవన్ సైతం ఉన్నారు.

మొత్తం మీద కుస్తీ అన్ని విభాగాలలోనూ భారత్ గోల్డెన్ స్వీప్ సాధించడం ద్వారా దక్షిణాసియా దేశాల కుస్తీ శక్తిగా ఆవిర్భవించింది.

Tags:    
Advertisement

Similar News