నేను బీజేపీకి దూరం కాలేదు.... కలిసే ఉన్నా.... విలీనంపై ఇప్పుడే చెప్పలేను....

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనను త్వరలోనే బీజేపీలో విలీనం చేయబోతున్నారన్న వార్తల నేపథ్యంలో… పవన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీకి ఎన్నడూ దూరం కాలేదన్నారు. ఇప్పుడు కూడా బీజేపీకి దూరంగా లేనన్నారు. కేవలం ప్రత్యేక హోదా విషయంలో ప్రజల కోరిక మేరకు మాత్రమే ఎన్నికల సమయంలో బీజేపీని వ్యతిరేకించాల్సి వచ్చిందన్నారు. జనసేనను బీజేపీలో విలీనం చేస్తారా? అన్న ప్రశ్నకు…. పార్టీని బీజేపీలో విలీనం చేసే అంశంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనన్నారు. మొన్నటి […]

Advertisement
Update: 2019-12-04 03:15 GMT

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనను త్వరలోనే బీజేపీలో విలీనం చేయబోతున్నారన్న వార్తల నేపథ్యంలో… పవన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తాను బీజేపీకి ఎన్నడూ దూరం కాలేదన్నారు. ఇప్పుడు కూడా బీజేపీకి దూరంగా లేనన్నారు. కేవలం ప్రత్యేక హోదా విషయంలో ప్రజల కోరిక మేరకు మాత్రమే ఎన్నికల సమయంలో బీజేపీని వ్యతిరేకించాల్సి వచ్చిందన్నారు.

జనసేనను బీజేపీలో విలీనం చేస్తారా? అన్న ప్రశ్నకు…. పార్టీని బీజేపీలో విలీనం చేసే అంశంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనన్నారు.

మొన్నటి ఎన్నికల్లో కూడా బీజేపీ, చంద్రబాబుతో తాను కలిసి ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండేదా? అని ప్రశ్నించారు. తాను విడిగా పోటీ చేయడం వల్లే వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఒక విధంగా వైసీపీ నేతలు… తాను కనిపిస్తే చేతులెత్తి దండం పెట్టాల్సి ఉందన్నారు.

అమిత్ షా అంటే తనకు చాలా గౌరవమని పవన్ చెప్పారు. దక్షిణాదిపై బీజేపీ ఉత్తరాది ఆధిపత్యం చెలాయిస్తోంది అంటూ గతంలో తానుచేసిన వ్యాఖ్యలపై సూటిగా సమాధానం చెప్పేందుకు పవన్ ఆసక్తి చూపలేదు.

Tags:    
Advertisement

Similar News