కుల వివాదం.... విచారణకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యే....

తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చిక్కుల్లో పడ్డారు. కుల వివాదంలో ఆమె విచారణకు హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ మహిళ కాదని.. క్రిస్టియన్ అని ఆమె ప్రత్యర్థులు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన ఈసీ శ్రీదేవి కుల నిర్ధారణపై విచారణ చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ను విచారించమని ఆదేశించింది. దీంతో మంగళవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీదేవి జాయింట్ కలెక్టర్ […]

Advertisement
Update: 2019-11-26 06:12 GMT

తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చిక్కుల్లో పడ్డారు. కుల వివాదంలో ఆమె విచారణకు హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది.

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ మహిళ కాదని.. క్రిస్టియన్ అని ఆమె ప్రత్యర్థులు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన ఈసీ శ్రీదేవి కుల నిర్ధారణపై విచారణ చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ను విచారించమని ఆదేశించింది.

దీంతో మంగళవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీదేవి జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఎదుట విచారణకు హాజరయ్యారు. శ్రీదేవి తన కుటుంబానికి చెందిన మూడు తరాల కుల ధ్రువీకరణ పత్రాలను అధికారులకు అందజేశారు.

ఇప్పటికే ఎమ్మెల్యే శ్రీదేవి తన కులంపై వివాదం చెలరేగడంతో రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతల ముసుగులో టీడీపీ నేతలు తనను రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.

ఇప్పుడు జాయింట్ కలెక్టర్ విచారణలో ఎమ్మెల్యే శ్రీదేవి ఎస్సీనా లేదా క్రిస్టియన్ అనా అనేది తేలుతుంది.. క్రిస్టియన్ అని తేలితే ఆమె ఎమ్మెల్యే పదవి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిణామం ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

Tags:    
Advertisement

Similar News