అమరావతే రాజధానిగా ఉండాలంటున్న సీమ నేతలు వీరే...

అమరావతిని చంద్రబాబు రాజధానిగా ప్రకటించిన సమయంలో అటు ఉత్తరాంధ్ర ప్రజలు, ఇటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అసంతృప్తి నుంచి రాయలసీమ టీడీపీ నేతలను మినహాయించాల్సి ఉంటుంది. తమకు దక్కాల్సిన రాజధానిని చంద్రబాబు తన వారి కోసం ఎత్తుకెళ్లారని రాయలసీమ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శివరామకృష్ణన్ కమిటీ చెప్పినట్టు చేయకుండా తనకు ఇష్టమైన చోట రాజధానిని చంద్రబాబు పెట్టుకోవడంపై ప్రకాశం, నెల్లూరు ప్రజలు వ్యతిరేకించారు. వికేంద్రీకరణ రాజధాని ఉంటుందని […]

Advertisement
Update: 2019-08-22 01:19 GMT

అమరావతిని చంద్రబాబు రాజధానిగా ప్రకటించిన సమయంలో అటు ఉత్తరాంధ్ర ప్రజలు, ఇటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ అసంతృప్తి నుంచి రాయలసీమ టీడీపీ నేతలను మినహాయించాల్సి ఉంటుంది. తమకు దక్కాల్సిన రాజధానిని చంద్రబాబు తన వారి కోసం ఎత్తుకెళ్లారని రాయలసీమ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

శివరామకృష్ణన్ కమిటీ చెప్పినట్టు చేయకుండా తనకు ఇష్టమైన చోట రాజధానిని చంద్రబాబు పెట్టుకోవడంపై ప్రకాశం, నెల్లూరు ప్రజలు వ్యతిరేకించారు.

వికేంద్రీకరణ రాజధాని ఉంటుందని ఆశించిన ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అన్ని ఓకే చోట చంద్రబాబు కేంద్రీకరించడంపై పెదవి విరిచారు.

ఇటీవల వచ్చిన వరదల కారణంగా రాజధాని ప్రాంతం మునిగిపోవడంతో రాజధాని అంశంపై ఇప్పుడు మరోసారి చర్చ జరుగుతోంది.

రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ప్రజలు రాజధానిని సురక్షిత ప్రాంతానికి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అటు ఉత్తరాంధ్ర వారు వికేంద్రీకరణ రాజధాని కోరుతున్నారు.

అయితే రాయలసీమకు చెందిన కొందరు నేతలు విచిత్రంగా…. అమరావతి రాజధానిగా ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు. మునిగినా సరే అక్కడే రాజధాని ఉండాలంటున్నారు. వీరిలో కొందరు అమరావతి వద్ద ముందస్తుగా భూములు కొన్న వారూ ఉన్నారు.

అమరావతి చంద్రబాబు పుణ్యమేనని… రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ఎన్నో దేశాలు తిరిగి కష్టపడ్డారని మాజీ మంత్రి, అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల సునీత వాదిస్తున్నారు. హైకోర్టు, ప్రభుత్వ భవనాల కోసం చంద్రబాబు పనులు మొదలుపెట్టారని… కాబట్టి రాజధాని అమరావతిలోనే ఉండాలని పరిటాల సునీత డిమాండ్ చేశారు.

ఇక కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా రాజధానిగా అమరావతే ఉండాలని స్పష్టం చేశారు. రాజధానిని అమరావతి నుంచి మరొక చోటికి తరలిస్తే ప్రజలు తిరగబడతారని జగన్‌ను హెచ్చరించారు అఖిలప్రియ.

మరో అడుగు ముందుకేసి దొనకొండకు రాజధానిని మారిస్తే అంగీకరించబోమని… దొనకొండ వద్ద భూములున్నాయన్న ఉద్దేశంతోనే మార్పు ఆలోచన చేస్తున్నారని అఖిలప్రియ వ్యాఖ్యానించారు.

రాయలసీమకే చెందిన సీపీఐ రామకృష్ణ కూడా చంద్రబాబుకే ఓటేశారు. అమరావతిని రాజధానిగా రాయలసీమ ప్రజలు కూడా ఆమోదిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజధానికి వరద ముప్పు ఏమీ లేదని అక్కడే రాజధాని ఉంచాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఇక ఇటీవల టీడీపీ చానళ్లలో జగన్‌పై ఒంటికాలితో లేస్తున్న కడప జిల్లా కాంగ్రెస్ నేత తులసి రెడ్డి కూడా జై అమరావతి అనేశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలతో రాజధాని మార్పుపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని… దీనిపై జగన్‌ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇలా రాయలసీమకు చెందిన పరిటాల సునీత, భూమా అఖిలప్రియ, రామకృష్ణ, తులసీ రెడ్డి లాంటి వారు తమ ప్రాంత ప్రయోజనాల గురించి కాకుండా అమరావతి కోసం ఆరాటపడడంపై సీమ విద్యావంతుల్లో చర్చ జరుగుతోంది.

చంద్రబాబు వద్ద మెప్పుకోసం వీరంతా ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న విమర్శలు రాయలసీమ ప్రజల నుంచి వస్తున్నాయి. వీరంతా సొంత ప్రాంత ద్రోహులు అని మండిపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News