యాషెస్ సిరీస్ లో ఆస్ట్ర్రేలియా బోణీ

బర్మింగ్ టెస్ట్ లో ఇంగ్లండ్ ఘోరపరాజయం స్టీవ్ స్మిత్ షోగా సాగిన తొలిటెస్ట్ ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ కమ్ యాషెస్ సిరీస్ లో భాగంగా…బర్మింగ్ హామ్ వేదికగా ముగిసిన తొలిటెస్ట్ లో ఆతిథ్య ఇంగ్లండ్ పై ఆస్ట్ర్రేలియా 251 పరుగుల భారీ విజయం సాధించింది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఆస్ట్ర్రేలియా 1-0 ఆధిక్యం సంపాదించింది. ఇంగ్లండ్ విజయాల అడ్డా బర్మింగ్ హామ్ వేదికగా ముగిసిన ఈ మ్యాచ్ ఆఖరి రోజు ఆటలో…398 పరుగుల భారీ లక్ష్యంతో […]

Advertisement
Update: 2019-08-06 01:47 GMT
  • బర్మింగ్ టెస్ట్ లో ఇంగ్లండ్ ఘోరపరాజయం
  • స్టీవ్ స్మిత్ షోగా సాగిన తొలిటెస్ట్

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ కమ్ యాషెస్ సిరీస్ లో భాగంగా…బర్మింగ్ హామ్ వేదికగా ముగిసిన తొలిటెస్ట్ లో ఆతిథ్య ఇంగ్లండ్ పై ఆస్ట్ర్రేలియా 251 పరుగుల భారీ విజయం సాధించింది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఆస్ట్ర్రేలియా 1-0 ఆధిక్యం సంపాదించింది.

ఇంగ్లండ్ విజయాల అడ్డా బర్మింగ్ హామ్ వేదికగా ముగిసిన ఈ మ్యాచ్ ఆఖరి రోజు ఆటలో…398 పరుగుల భారీ లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్..52.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.

కంగారూ ఆఫ్ స్పిన్నర్ నేథన్ లయన్ 49 పరుగులిచ్చి 6 వికెట్లు, ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ 32 పరుగులిచ్చి4 వికెట్లు పడగొట్టి తమజట్టు విజయంలో ప్రధానపాత్ర వహించారు.

ఇంగ్లండ్ ఆటగాళ్లలో లోయర్ ఆర్డర్ ఆటగాడు క్రిస్ వోక్స్ 37 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

స్మిత్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్…

తొలిఇన్నింగ్స్ లో 144 పరుగులతో ఫైటింగ్ సెంచరీ సాధించడంతో పాటు…రెండో ఇన్నింగ్స్ లో సైతం 142 పరుగులు సాధించిన కంగారూ స్టార్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్ ప్రత్యర్థిగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్ర్రేలియా విజయం సాధించడం 2001 తర్వాత ఇదే మొదటిసారి.
సిరీస్ లోని రెండోటెస్ట్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా ఆగస్టు 14 నుంచి 18 వరకూ జరుగనుంది.

Tags:    
Advertisement

Similar News