ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా పల్లంరాజు

జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ గత రెండు దఫాలుగా అధికారంలోని రాలేదు. అటు కేంద్రంలో ఇటు తెలంగాణ, ఏపీలో దారుణంగా ఓడిపోవడంతో అప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ పక్కకు తప్పుకున్నారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రఘువీరారెడ్డిపై కూడా అనేక విమర్శలు రావడంతో ఆయన కూడా ఆ పదవిపై ఆసక్తి చూపించలేదు. రఘువీరా రాజీనామాతో పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి వచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పల్లంరాజు […]

Advertisement
Update: 2019-08-03 06:30 GMT

జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ గత రెండు దఫాలుగా అధికారంలోని రాలేదు. అటు కేంద్రంలో ఇటు తెలంగాణ, ఏపీలో దారుణంగా ఓడిపోవడంతో అప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ పక్కకు తప్పుకున్నారు.

మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రఘువీరారెడ్డిపై కూడా అనేక విమర్శలు రావడంతో ఆయన కూడా ఆ పదవిపై ఆసక్తి చూపించలేదు. రఘువీరా రాజీనామాతో పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి వచ్చింది.

ఇక ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పల్లంరాజు మంగపతిని నియమించారు. యూపీఏ సర్కారు హయాంలో కేంద్ర మంత్రిగా పని చేసిన పల్లంరాజు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఆయన విధేయుడిగా ఉన్నాడు. మంగపతి తండ్రి శ్రీరామ సంజీవరావు కూడా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నారు.

యూపీఏ సర్కారు వచ్చినప్పుడు కాకినాడ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో 2006 నుంచి 2009 వరకు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

Tags:    
Advertisement

Similar News