సాహో సాంగ్స్.... పాటకో సంగీత దర్శకుడు!

మొన్నటివరకు షేడ్స్ ఆఫ్ సాహో పేరిట మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు సాహోకు సంబంధించి పాటల విడుదల కార్యక్రమం షురూ కాబోతోంది. ముందుగా సైకో సైయాన్ అనే సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. ఆ డీటెయిల్స్ ను త్వరలోనే బయటపెట్టబోతున్నారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే.. ఇకపై విడుదలకాబోతున్న సాంగ్స్ కు ఒక్కో సంగీత దర్శకుడి పేరు వేయబోతున్నారు. త్వరలోనే విడుదలకానున్న సైకో సైయాన్ పాటకు తనిష్క్ బాగ్చి […]

Advertisement
Update: 2019-07-04 09:00 GMT

మొన్నటివరకు షేడ్స్ ఆఫ్ సాహో పేరిట మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు సాహోకు సంబంధించి పాటల విడుదల కార్యక్రమం షురూ కాబోతోంది. ముందుగా సైకో సైయాన్ అనే సాంగ్ ను విడుదల చేయబోతున్నారు.

ఆ డీటెయిల్స్ ను త్వరలోనే బయటపెట్టబోతున్నారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే.. ఇకపై విడుదలకాబోతున్న సాంగ్స్ కు ఒక్కో సంగీత దర్శకుడి పేరు వేయబోతున్నారు.

త్వరలోనే విడుదలకానున్న సైకో సైయాన్ పాటకు తనిష్క్ బాగ్చి సంగీతం అందించాడు. లిరికల్ వీడియోలో అతడి పేరునే ప్రకటించబోతున్నారు. ఆ తర్వాత మరో 2 పాటలకు మరో ఇద్దరు సంగీత దర్శకుల పేర్లను ప్రకటిస్తారు. మిగిలిన 3 పాటలకు శంకర్-ఎహసాన్-లాయ్ పేర్లను పబ్లిష్ చేస్తారు.

మేకర్స్ ఇలా చేయడం వెనక కారణం చాలామందికి తెలిసిందే. ఈ సినిమా నుంచి శంకర్-ఎహసాన్-లాయ్ తప్పుకున్నారు. అప్పటికే వాళ్లు 3 పాటలు కంపోజ్ చేశారు. మిగిలిన పాటల్ని ఇతర సంగీత దర్శకులతో చేయించుకున్నారు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసే బాధ్యతను జిబ్రాన్ కు అప్పగించారు.

Tags:    
Advertisement

Similar News