Aa Okkati Adakku | మరో మంచి మెలొడీ

Aa Okkati Adakku - అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా ఆ ఒక్కటి అడక్కు. ఈ సినిమా నుంచి ఓ మెలొడీ సాంగ్ రిలీజైంది.

Advertisement
Update: 2024-04-27 08:11 GMT

అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు'. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మాణంలో, నూతన దర్శకుడు మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ఓ మోస్తరు అంచనాలున్నాయి.

అల్లరి నరేష్ సరసన ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించాడు.

మ్యూజికల్ ప్రమోషన్‌లలో భాగంగా, యూనిట్ సెకండ్ సింగిల్ విడుదల చేసింది. ఇది క్లాసికల్ బీట్‌తో సాగిన మెలొడీ. భాస్కరభట్ల అల్లరి నరేష్ భావాలను తెలియజేసే ఆకర్షణీయమైన సాహిత్యం అందించగా , యశస్వి కొండేపూడి తన చక్కని గానంతో ప్రత్యేక ఆకర్షణను తెచ్చారు. బ్యూటీఫుల్ కెమిస్ట్రీని పంచుకున్న అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా ఆకట్టుకున్నారు.

వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు, అబ్బూరి రవి రచయిత. ఛాయాగ్రహణం సూర్య, మేకర్స్ ఇటీవల ప్రకటించినట్లుగా, ఆ ఒక్కటి అడక్కు మే 3న గ్రాండ్ గా విడుదల కానుంది.

Full View

Tags:    
Advertisement

Similar News