Bhimaa Movie OTT | ఓటీటీలోకి భీమా

Bhimaa Movie OTT | గోపీచంద్ తాజా చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement
Update: 2024-04-25 13:42 GMT

Bhimaa Movie OTT | గోపీచంద్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ "భీమా". ఇప్పుడీ సినిమా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ ఓ వీడియో రిలీజ్ చేశాడు.

"మ్యాజిక్ ఆఫ్ భీమా మీ స్క్రీన్స్ మీదకు వచ్చేసింది. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ అవుతోంది. మీరంతా తప్పక చూడండి" అంటూ విజ్ఞప్తి చేశాడు. మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు "భీమా" సినిమాను డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఎక్కువగా చూస్తున్నారు.

ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించారు. కన్నడ దర్శకుడు హర్ష ఈ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. భీమా చిత్రంలో ప్రియ భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు.

పవర్ ఫుల్ పోలీస్ కథతో తెరకెక్కిన ఈ సినిమా గత నెల 8వ తేదీన థియేటర్స్ లోకి వచ్చింది. కానీ పెద్దగా రెస్పాన్స్ రాబట్టలేకపోయింది. బి, సి సెంటర్స్ లో మాత్రం ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ప్రత్యక్షమైంది. రిజల్ట్ ఏంటనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. 

Tags:    
Advertisement

Similar News