Odela 2 | ఓదెల 2 షూటింగ్ అప్ డేట్స్

Odela 2- తమన్న లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా ఓదెల-2. ఈ మూవీ షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం..

Advertisement
Update: 2024-04-27 07:57 GMT

మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌ వర్క్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఒదెల 2’. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ సంపత్ నంది క్రియేటర్ గా, ఓదెల రైల్వే స్టేషన్ ఫేమ్ అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. మహా శివరాత్రి నాడు విడుదలైన 'భైరవి' నాగ సాధువుగా తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై హైప్, అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

ఈ మల్టీ లాంగ్వేజ్ సూపర్ నేచురల్ విజువల్ వండర్ భారతదేశంలోని వివిధ అద్భుతమైన ప్రదేశాలలో తన మొదటి షూట్ షెడ్యూల్‌ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. మహాదేవ్ పరమశివుని దివ్య ఆశీస్సులతో ఆయన పవిత్ర నివాసం వారణాసిలో మార్చిలో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రారంభ షెడ్యూల్‌లో వారణాసి, హైదరాబాద్, భూధాన్ పోచంపల్లి, పోతారం, టంగటూర్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు.

రెండవ షూట్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాదు, చుట్టుపక్కల ప్రాంతాలలో జరుగుతోందని చిత్ర బృందం అనౌన్స్ చేసింది. ఈ షెడ్యూల్‌ 20-25 రోజుల పాటు జరుగుతుంది. సినిమాలోని ప్రధాన తారాగణం, కీలక సహాయ నటీనటులతో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది యూనిట్.

ఈ చిత్రంలో తమన్నాతో కలిసి హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, నటిస్తున్నారు. కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ అద్భుతమైన స్కోర్‌తో తమన్నా పాత్రలోకి మారడాన్ని చూపించే వర్కింగ్ వీడియోను విడుదల చేశారు. 

Tags:    
Advertisement

Similar News