జగన్ చేతికి వైఎస్ఆర్ వాచీ.... తీపి గుర్తు ఇది

వైఎస్ఆర్ కాంగ్రెస్.. పార్టీ పేరులోనే నాన్నను పెట్టారు వైఎస్ జగన్. తనకు జన్మనివ్వడంలోనే కాదు.. రాజకీయంగా బతుకునివ్వడంలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రతి విషయంలోనూ జగన్ స్ఫూర్తిగా తీసుకున్నారు. అందుకే యువజన శ్రామిక రైతు పార్టీలో వైఎస్ఆర్ ను ఇనుమడింపచేశారు. అలా నాన్న ఆకాంక్షలను, వారసత్వాన్ని క్షణ క్షణం తలుచుకునే జగన్.. గెలిస్తే మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెస్తానంటూ ప్రచారంలో చెప్పుకొచ్చాడు. ఇక నాన్నలాగానే 3వేలకు పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని […]

Advertisement
Update: 2019-05-30 05:10 GMT

వైఎస్ఆర్ కాంగ్రెస్.. పార్టీ పేరులోనే నాన్నను పెట్టారు వైఎస్ జగన్. తనకు జన్మనివ్వడంలోనే కాదు.. రాజకీయంగా బతుకునివ్వడంలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రతి విషయంలోనూ జగన్ స్ఫూర్తిగా తీసుకున్నారు. అందుకే యువజన శ్రామిక రైతు పార్టీలో వైఎస్ఆర్ ను ఇనుమడింపచేశారు.

అలా నాన్న ఆకాంక్షలను, వారసత్వాన్ని క్షణ క్షణం తలుచుకునే జగన్.. గెలిస్తే మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెస్తానంటూ ప్రచారంలో చెప్పుకొచ్చాడు. ఇక నాన్నలాగానే 3వేలకు పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేశారు. ప్రతివిషయంలోనూ వైఎస్ బాటలో నడిచే జగన్ తాజాగా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వేళ కూడా నాన్న వాడిన వాచీనే చేతికి పెట్టుకొని కనిపించడం అందరినీ ఆకట్టుకుంది.

జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దివంగత వైఎస్ హెలీకాప్టర్ ప్రమాదంలో చనిపోక ముందు చేతికి పెట్టుకొనే వాచీని తను పెట్టుకొని రావడం కనిపించింది. అలా నాన్న ఆశయాలను, వారసత్వాన్ని జ్ఞాపకాలను తన వెంట ఉంచుకొని జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం విశేషం. జగన్ చేతికి ఉన్న వాచీని వైఎస్ వాచీగా అందరూ అక్కడున్న వారు తెలుసుకొని జగన్ అభిమానానికి ఫిదా అయ్యారు.

Tags:    
Advertisement

Similar News