జగన్ ముస్లిం పక్షపాతి.. సాక్ష్యాలివే

తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా ముస్లింలకు ప్రత్యేక హామీ ఇచ్చారు సీఎం జగన్. ముస్లింల ప్రార్థనా స్థలాల నిర్వహణకు నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Advertisement
Update: 2024-04-27 15:18 GMT

ఏపీలో పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ముస్లింలను ద్వేషించే ఎన్డీఏ కూటమికి, సంక్షేమంలో ముస్లింలకు పెద్దపీట వేసిన వైసీపీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం కూడా ఇదేనని చెప్పుకోవాలి. అవును, మైనార్టీల విషయంలో సీఎం జగన్ దేశంలో ఏ ముఖ్యమంత్రీ తీసుకోనంత శ్రద్ధ తీసుకున్నారు, ఎవరూ చేయలేరనుకున్నంతగా వారి సంక్షేమం కోసం కృషి చేశారు. మేనిఫెస్టోలో చెప్పినవే కాదు, చెప్పనివి కూడా అమలు చేశారు. 2024లో విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా ముస్లిం మైనార్టీలకు ఆయన ప్రాధాన్యతనిచ్చారు.


2019 మేనిఫెస్టోలో చెప్పినవి...

2019లో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవాటిలో 99 శాతం అమలు చేశారు సీఎం జగన్. అందులో మైనార్టీలకోసం ఇచ్చిన హామీలు నూరుశాతం అమలయ్యాయి. వక్ఫ్ బోర్డ్, ముస్లిం మైనార్టీల ఆస్తుల రీసర్వే, పరిరక్షణకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు జగన్. హజ్ యాత్రకు సాయం చేశారు, వైఎస్ఆర్ బీమా సౌకర్యం కల్పించారు. ఇమామ్ లకు జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇచ్చారు. ఇమామ్ ల గౌరవ వేతనాన్ని రూ.10వేలకు, మౌజమ్ ల వేతనాన్ని రూ.5వేలకు పెంచారు.

చెప్పనివి కూడా..

మేనిఫెస్టోలో చెప్పనివాటిని కూడా అమలు చేసిన ఏకైక సీఎం జగన్. ముస్లింలకు డిప్యూటీ సీఎం పదవి, మండలిలో డిప్యూటీ చైర్ పర్సన్ పదవి ఇచ్చి గౌరవించారు. ఉర్దూకి రెండో అధికార భాషగా గుర్తింపు తెచ్చారు. గతంలో హజ్ యాత్రికులు హైదరాబాద్ నుంచి యాత్రకు వెళ్లాల్సి వచ్చేది. జగన్ హయాంలో విజయవాడ నుంచే వారు యాత్ర మొదలు పెట్టేలా ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేశారు. ఏపీ మైనార్టీస్ కాంపోనెంట్ చట్టం చేసి మరీ.. ఆయా హామీల అమలుకి చట్టబద్ధత కలిగేలా చేశారు జగన్. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 7 సీట్లు ముస్లిం వర్గానికి కేటాయించి వారిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.


తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా ముస్లింలకు ప్రత్యేక హామీని ఇచ్చారు సీఎం జగన్. ఇప్పటి వరకు అమలు చేసిన హామీలను యథావిధిగా కొనసాగిస్తామన్నారు. అదే సమయంలో ముస్లింల ప్రార్థనా స్థలాల నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే. తాను ముస్లిం పక్షపాతి అని మరోసారి రుజువు చేసుకున్నారాయన. అదే సమయంలో ముస్లిం రిజర్వేషన్లకు ఎసరు పెట్టిన ఎన్డీఏ కూటమి వారికి శాశ్వత శత్రువుగా మారింది. 

Tags:    
Advertisement

Similar News